కర్నూలు సీఐడీ అధికారులు నమోదు చేసిన కేసులో వారు నోటీసులు ఇచ్చినా హాజరు కాని దేవినేని ఉమ.. వారికి అందుబాటులో లేకుండా పోయారు. అరెస్ట్ చేయడానికి వచ్చారో.. లేకపోతే ప్రశ్నించడానికే వచ్చారో కానీ.. సీఐడీ అధికారులు మంగళవారం.. గొల్లపూడిలోని ఆయన ఇంటికి వెళ్లారు. అయితే.. అక్కడ దేవినేని ఉమ లేకపోవడంతో.. వెనుదిరిగి వెళ్లిపోయారు. దీంతో అరెస్ట్ భయంతో దేవినేని ఉమ అజ్ఞాతంలోకి వెళ్లారన్న ప్రచారం జరుగుతోంది. ఈ విషయాన్ని దేవినేని ఉమ ఎక్కడా ప్రస్తావించడం లేదు కానీ.. సోషల్ మీడియాలో మాత్రం తన ఉనికి వెల్లడిస్తున్నారు. తాను ఎక్కడ ఉన్నది చెప్పకపోయినా… ఏం చేస్తున్నది చెబుతున్నారు.
మార్చి 15న కొవిడ్ మొదటి డోస్ .. ఈ నెల 15న రెందో దశ వ్యాక్సిన్ తీసుకున్నానని.. డాక్టర్ల సలహామేరకు కొవిడ్ రక్షణ చర్యలు పాటిస్తూ క్వారంటైన్లో ఉన్నట్లుగా బెబుతున్నారు. నిజానికి దేవినేని ఉమకు ఈ సమయం అత్యంత కీలకం. ఎందుకంటే.. పోలవరం విషయంలో ఏపీ సర్కార్ రీ రివర్స్ టెండరింగ్ వేస్తోంది. కొత్త కాంట్రాక్టర్కు భారీగా అంచనాలు పెంచి చెల్లింపులు చేయాలని చూస్తోంది. ఈ క్రమంలో గతంలో జలవనరుల మంత్రిగా పని చేసిన దేవినేని ఉమ మీడియా ముందుకు రాకపోడం… ప్రభుత్వానికి కలసి వచ్చినట్లయింది. పోలవరం విషయంలో దేవినేని ఉమపై గతంలో జగన్ తీవ్రమైన విమర్శలు చేశారు. ఇప్పుడు ఎదురుదాడి చేయాల్సిన అవకాశం వచ్చినా దేవినేని ఉమ బయటకు రాలేకపోవడం.. ప్రభుత్వానికి కలిసి వచ్చింది. అయితే.. దేవినేని ఉమను అలా కంట్రోల్ చేయడానికే సీఐడీ అధికారులు.. ఇలా హడావుడి చేస్తున్నారన్న అనుమానాలు టీడీపీలో వ్యక్తమవుతున్నాయి.
పోలవరం అంచనాలను గుట్టుచప్పుడు కాకుండా పెంచడమే కాకుండా… ఈ అంశంపై సాధికారికంగా స్పందించే దేవినేని ఉమపై… అరెస్ట్ చేయడమో లేకపోతే ఆజ్ఞాతంలోకి వెళ్లడమే చేయడానికే కేసుల వ్యూహం అమలు చేశారని అనుమానిస్తున్నారు. ఇప్పటికే దేవినేని ఉమ.. హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేశారు. హైకోర్టులో రిలీఫ్ దొరికితే.. ఆయన మీడియా ముందుకు వచ్చి.. పోలవరం పెంచిన అంచనాల పైనా.. కేసులపైనా మాట్లాడే అవకాశం ఉంది. పోలవరం అంచనాల పెంపు జీవో విడుదలైన వెంటనే.. దేవినేని ఉమ మాట్లాడకుండా చేయడంలో జగన్ సర్కార్ సక్సెస్ అయినట్లేనని చెప్పుకోవచ్చు.