వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గనుల దోపిడీ నిరంతరాయంగా సాగింది. అప్పటి వరకూ లీజులతో వ్యాపారం చేసుకుంటున్న వారిని తన్ని తరిమేయడానికి అన్ని అడ్డగోలు పనులు చేశారు. అందులో ఒకటి వందల కోట్ల జరిమానా విధించడం. పదే పదే తనిఖీలు చేయడం. ఇలా చేసి వారు వ్యాపారాల్ని వదిలిసి వెళ్తారా లేకపోతే.. ఇచ్చింది తీసుకుని తమకు ఇచ్చేస్తారా అని బేరాలడారు. చివరికి రాష్ట్రంలో మైనింగ్ వ్యాపారాలన్నింటినీ స్వాధీనం చేసుకున్నారు. ఇలాంటి వాటిపై సీఐడీ దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది.
మంత్రి గొట్టిపాటి సహా అనేక మంది వందల కోట్ల జరిమానాలు
వైసీపీ అధికారంలోకి రాగానే టీడీపీ నేతల ఆర్థిక మూలాలు దెబ్బకొట్టేందుకు వారి వ్యాపారాలపై పడింది. ప్రభుత్వం నుంచి లీజులు తీసుకుని మైనింగ్ చేస్తున్న వారిని ముఖ్యంగా టార్గెట్ చేసింది. వారి వ్యాపారాలను స్వాధీనం చేసుకునేందుకు అధికారాన్ని వాడింది. మైనింగ్ శాఖ అధికారులతో తనిఖీలు చేయించి వందల కోట్లు జరిమానాలు విధించింది. ఆయన దెబ్బకు తట్టుకోలేక సిద్ధా రాఘవరావు లాంటి వారు పార్టీ మారిపోయారు. అప్పుడు ఆయన మైనింగ్ అంతా సక్రమం అయింది.కానీ గొట్టిపాటి లాంటివాళ్లు కోర్టులకు వెళ్లారు. అయినా వారి లీజు ప్రాంతాల్ని ఇతరులు స్వాధీనం చేసుకున్నారు.
జరిమానాలు కట్టాలి లేకపోతే వదిలేసి వెళ్లిపోవాలి !
వందల కోట్ల జరిమానాలంటే చిన్న విషయం కాదు. వారు భయంతో వణికిపోయేలా చేసి.. మొత్తం వదిలేసుకుని వెళ్లిపోయేలా చేసేవ్యూహం అది. కోర్టులు స్టే ఇచ్చినప్పటికీ.. అక్కడ వ్యాపారం చేయాలంటే..అధికారులు ఊరుకునేవారు కాదు. ఆ లీజులన్నీ అలా వదిలేయడం కన్నా ఎంతో కొంత ఇస్తారు అని చెప్పి వైసీపీ నేతలు దౌర్జన్యంగా తీసుకునేవారు. వారే మైనింగ్ చేసుకునేవారు.
భారీ జరిమానాలతో యాజమాన్యాలు మారిన మైనింగ్ పై సీఐడీ దృష్టి ?
అధికారాన్ని ఓ మాఫియా మాదిరిగా వాడుకుని కాకినాడ పోర్టు వంటి వాటిని లాక్కున్నారు. ఆ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దాంతో పోర్టును తిరిగి ఇచ్చేశారని ప్రచారం జరుగుతోంది. ఇప్పుడు ఇలా వందలకోట్లు ఫైన్ వేసిన తర్వాత యాజమాన్యాలను మార్చేసిన మైనింగ్ మాఫియాపైనా సీఐడీ దృష్టి సారించే అవకాశం ఉంది.