ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై దుష్ప్రచారం చేస్తున్నారని ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు ఫిర్యాదు చేస్తే వెంటనే సీఐడీలోని ఫలానా అధికారి విచారించాలని సీఈవో కార్యాలయం నుంచి ఆదేశాలొచ్చాయి. వెంటనే చంద్రబాబు, లోకేష్ తో పాటు మరో పది మందిపై కేసులు పెట్టేశారు. టీడీపీ ఆఫీసుకు వెళ్లి నోటీసులు ఇచ్చి వచ్చారు. ఈసీ గొప్పగా పని చేస్తుందే అని ప్రజలకు డౌట్ వస్తుందేమోనని.. టీడీపీ ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలు తీసుకోవాలని సీఐడీకి ఆదేశాలిచ్చారు.
సీఐడీ వెంటనే సజ్జల భార్గవపై కేసు పెట్టింది. ఇక్కడ సీఐడీ వ్యవహరించిన విధానం ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. టీడీపీ పై వచ్చిన ఫిర్యాదుపై టీడీపీ అధ్యక్షుడు.. జాతీయ ప్రధాన కార్యదర్శులు అయిన చంద్రబాబు, లోకేష్ లను ఏ వన్, ఏ టుగా పెట్టారు. కానీ వైసీపీపై దర్యాప్తు చేయాలని ఇచ్చిన ఆదేశాలతో తీసుకుంటున్న చర్యలతో పెట్టిన కేసుల్ో వైసీపీ అధ్యక్షుడు జగన్ ను కానీ.. ఆ పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే సజ్జల రామకృష్ణారెడ్డి పేరు కానీ లేదు. అక్కడ ఏ చట్టం ప్రకారం చంద్రబాబు, లోకేష్ పై కేసు పెట్టారో.. ఇక్కడ కూడా జగన్, సజ్జల రామకృష్ణారెడ్డిని కూడా కేసుల్లో చేర్చారు. కానీ తప్పుడు కేసుల సీఐడీ.. ఇక్కడ మరోసారి దొరికిపోయింది.
ఇప్పుడు సీఐడీ ఇలా తప్పించుకునే అవకాశం లేదు. అలా కేసులు పెట్టకపోతే సీఐడీ అధికారే ఇరుక్కుపోతారు. రెండు కేసుల్లో వేరియేషన్స్ ఎందుకు చూపించాల్సి వచ్చిందని ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పాల్సి ఉంటుంది. సీఐడీ అధికారి చంద్రబాబు, లోకేష్ లపై పెట్టిన కేసుతో.. జగన్ , తండ్రి సజ్జలపైనా కేసు పెట్టాలి. ఇప్పటికే కుమార సజ్జలపై కేసు పెట్టేశారు.