ఏపీసీఐడీ అధికారులు ఢిల్లీలో మరోసారి తమ పరువు తీసుకున్నారు. 41A నోటీసులు ఇవ్వడానికి విజయవాడ నుంచి ఢిల్లీకి వచ్చి …ముందుగా వాట్సాప్‌లో నోటీసులు పంపారు. అందుకున్నానని లోకేష్ రిప్లై ఇచ్చాక మళ్లీ.. అక్కడి దాకా వచ్చి నోటీసుల నేరుగా ఇవ్వకపోతే బాగుండదని.. గల్లా జయదేవ్ అంటికి కాళ్లీడ్చుకుంటూ వచ్చారు. లోపలకు వెళ్లి మళ్లీ నోటీసులు ఇచ్చి వెళ్లారు. సీఐడీ అధికారుల తీరు ఢిల్లీ మడియా వర్గాల్లో కామెడీగా మరింది. 14వ తేదీన ఉదయం గుంటూరులోని సీఐడీ కార్యాలయానికి హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఇటీవల ఏ 14గా లోకేష్ పేరు చేర్చారు. లోకేష్ ముందస్తు బెయిల్ కు పిటిషన్ వేయడంతో విచారణలో ఎఫ్ఐఆర్ మార్చామని హైకోర్టుకు ఏజీ చెప్పారు.. ఎలా మార్చారు.. సాక్షిగా మార్చారా లేకపోతే.. నిందితుడిగానే ఉంచారా అన్నదానిపై స్పష్టత లేదు. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో నారా లోకేష్ ను అరెస్టు చేయబోమని 41ఏ నోటీసులు ఇస్తామని చెప్పడంతో అరెస్టు చేసే ప్రశ్నే ఉండదు కాబట్టి.. బెయిల్ పిటిషన్‌ను హైకోర్టు డిస్పోజ్ చేసింది. అలాగే స్కిల్ కేసు, ఫైబర్ నెట్ కేసుల్లోనూ నారా లోకేష్‌ను నిందితుడుగా చేర్చారు. దీంతో ఆ కేసుల్లోనూ ముందస్తు బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించారు. అక్టోబర్ నాలుగో తేదీ వరకూ అరెస్ట్ చేయవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చింది.
అయితే నారా లోకేష్‌కు నోటీసులు ఇవ్వడానికి నేరుగా సీఐడీ అధికారులు ఢిల్లీకి వచ్చారు. శుక్రవారమే వారు ఢిల్లీకి వచ్చారు. కానీ నారా లోకేష్‌కు నోటీసులు ఇచ్చే ప్రయత్నం చేయలేదు. అదే సమయంలో వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సీఐడీ అధికారులకు నారా లోకేష్ ఎక్కడున్నారో తెలియడం లేదని.. ప్రచారం ప్రారంభించారు. నారా లోకేష్ ఎక్కడున్నారో తెలుసుకోవడం పెద్ద విషయం కాదని.. నోటీసులు అయినా ఢిల్లీకి వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏమిటని.. వాట్సాప్, మెయిల్ చేస్తే సరిపోదా అన్న భావన అందరికీ వచ్చింది. కానీ సీఐడీ అధికారుల తీరే వేరు. అందుకే ముందుగా వాట్సాప్ లో పంపి.. తర్వాత నేరుగా వచ్చి నోటీసులు ఇచ్చి వెళ్లారు.