ప్రముఖ సినిమాటోగ్రాఫర్ కె.కె. సెంథిల్ కుమార్ ఇంట విషాదం నెలకొంది. ఆయన భార్య రూహి కొద్దిసేపటి క్రితమే కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. హైదరాబాద్ లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో ఆమెకు చికిత్స అందిస్తున్నారు. అయితే రూహి ఆరోగ్యం బాగా క్షీణించడంతో పరిస్థితి చేజారిపోయింది. 2009 జూన్‌లో రుచితో సెంథిల్ వివాహమైంది. ఆమె హైదరాబాద్‌లో యోగా టీచర్‌గా పని చేస్తున్నారు. ఐతే సినిమాతో సెంథిల్ కుమార్ సినీ జీవితం ప్రారంభమైంది. సై, ఛత్రపతి, అశోక్, అరుంధతి, యమదొంగ, ఈగ, బాహుబలి లాంటి చిత్రాలకు సెంథిల్ పని చేసిన సంగతి తెలిసిందే.