సుప్రీంకోర్టు ఆడిటోరియంలో సినిమా ప్రదర్శన చేయబోతున్నారు. సాయంత్రం 4.15నిమిషాలకు భారత ప్రధాన న్యాయమూర్తితో పాటు సుప్రీంకోర్టు న్యాయమూర్తులు, రిజిస్ట్రారర్, బార్ అసోసియేషన్ ప్రతినిధులు సినిమా చూడబోతున్నారు.
లింగ సమానత్వం ఇతివృత్తంగా తెరకెక్కిన లపతా లేడీస్ సినిమాకు ఈ అరుదైన గౌరవం దక్కింది. 2003లో విడుదలైన ఈ సినిమా… సమాజంలో లింగభేదం ఎంతలా ఉంటుందో చూపిస్తుంది.
సుప్రీంకోర్టుకు 75వ వార్షికోత్సవం పురస్కరించుకొని వజ్రోత్సవ వేడుకలు జరుపుకుంటోంది. అందులో భాగంగా ఈ సినిమాను ప్రదర్శించబోతున్నారు.
ఈ సినిమా దర్శకురాలు కిరణ్ రావుతో పాటు నిర్మాత, నటుడు అమీర్ ఖాన్ కూడా సీజేఐతో కలిసి సినిమాను వీక్షించబోతున్నారు.
కొత్తగా పెళ్లి చేసుకున్న గ్రామీణ ప్రాంతానికి చెందిన రైలు ప్రయాణం సమయంలో తప్పిపోయిన సంఘటన ఆధారంగా ఈ సినిమాను తీయగా, విమర్శకుల ప్రశంసలందుకున్న చిత్రంగా నిలిచిపోయింది.