లాక్ డౌన్ ప్రభావం అన్ని సినిమాలపై పడింది. రిలీజ్ డేట్లు మార్చి, రీ షెడ్యూళ్లు చేసుకునే పరిస్థితి వచ్చింది. ఇది వరకే రిలీజ్ డేట్ ప్రకటించిన సినిమాలు, చెప్పిన సమయానికి సినిమాని తీసుకురావడం కష్టం. అయితే ఈ ఈబ్బంది ‘ఆర్.ఆర్.ఆర్’కి లేదట. రాజమౌళి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని జనవరి 8న విడుదల చేస్తామని చిత్రబృందం ఇది వరకే ప్రకటించింది. రాజమౌళి సినిమా, అందులోనూ… లాక్ డౌన్. దాంతో ఆర్.ఆర్.ఆర్ చెప్పిన సమయానికి రావడం కష్టమని సినీ అభిమానులు ఇప్పటికే ఓ అభిప్రాయానికి వచ్చేశారు. కానీ… లాక్ డౌన్ వల్ల ఈ సినిమా విడుదల తేదీ మార్చే ప్రసక్తి లేదని చిత్రబృందం చెబుతోంది. అనుకున్న సమాయానికే ఈ సినిమాని విడుదల చేస్తార్ట. ఈ విషయంలో రాజమౌళి ఓ క్లారిటీతో ఉన్నాడని, నిర్మాత దానయ్య కీ విడుదల తేదీ విషయంలో ఎలాంటి బెంగా లేదని సమాచారం. ఇది రాజమౌళి సినిమా, దానికి తోడు అతి పెద్ద మల్టీస్టారర్. ఎప్పుడువిడుదలైనా సరే, చూడ్డానికి ప్రేక్షకులు సిద్ధంగా ఉంటారు. అలాగని అతి ధీమాతో లేదు చిత్రబృందం. చెప్పిన సమయానికే ఈ సినిమాని తీసుకురావడానికి శతవిధాలా కృషి చేస్తోంది. సో.. ఇప్పటికైతే రిలీజ్ డేట్ విషయంలో ఢోకా లేనట్టే.