రిలీజ్ డేట్ల కన్ఫ్యూజన్ ఎవ్వరినీ వదలడం లేదు. మొన్నా మధ్య మెగా హీరోల మధ్య పోటీకి… రిలీజ్ డేట్లే కారణమయ్యాయి. ఈసారి అక్కినేని హీరోల మధ్య కాంపిటీషన్‌కి తెర లేపాయి. నాగచైతన్య కథానాయకుడిగా నటిస్తున్న ‘సవ్యసాచి’ ని మే 24న విడుదల చేయాలని చిత్రబృందం భావించింది. అయితే.. నాగార్జున – వర్మల ‘ఆపీసర్’ని మే 25న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. దాంతో నాగార్జున వర్సెస్ నాగచైతన్య.. పోరు మొదలైంది. తండ్రీ కొడుకుల మధ్య పోరు తప్పదేమో అనుకుంటున్న సమయంలో ‘సవ్యసాచి’ కొత్త రిలీజ్ డేట్ వచ్చింది. జూన్ 14క్కి సవ్యసాచి వెళ్లిపోయి.. ‘ఆఫీసర్’కి దారిచ్చేసింది. మే నాటికి ‘సవ్యసాచి’ విడుదలకు సిద్ధంగానే ఉన్నా ‘ఆఫీసర్’ కోసం వెనక్కి వెళ్లక తప్పడం లేదు. అన్నట్టు ‘సవ్యసాచి’ ఫస్ట్ లుక్‌ని ఈ నెల 18న విడుదల చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నాగచైతన్య సరసన నిధి అగర్వాల్ కథానాయికగా నటిస్తోంది. కీరవాణి సంగీతం అందిస్తున్నారు.