తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ నుంచి బయటకు రావడం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలకమైన మార్పులకు కారణం అయింది. అప్పటి వరకూ.. తెలుగుదేశం పార్టీతో సన్నిహితంగా వ్యవహరించిన జనసేన …ఆ తర్వాత పూర్తి వ్యతిరేకంగా మారింది. జనసేన విధానంలో వచ్చిన మరో మౌలికమైన మార్పు వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేయకపోవడం. అంతకు ముందు వరకూ వైసీపీ నేతలు పవన్ కల్యాణ్ ను తీవ్రంగా విమర్శించేవారు. ఆ తర్వాత సైలెంటయ్యారు. చంద్రబాబును ఓడించాలనే ఏకైక లక్ష్యంతో జగన్ పవన్‌లను కలపాలనే ఆలోచన… బీజేపీ చేసినట్లు గతంలోనే ప్రచారం జరిగింది. దీనికి సంబంధించిన కార్యాచరణ కూడా… రాజ్యాంగ పదవిలో ఉన్న ఓ వ్యక్తి చక్క బెడుతున్నారని… ఓ ప్రముఖ దినపత్రిక చాలా కాలంగా చెబుతోంది.
కానీ ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. దాంతో జగన్ – పవన్ మధ్య తేడా ఎందుకొచ్చిందన్నది మిలియన్ డాలర్ క్వశ్చన్ గా మారింది. కొద్ది రోజుల క్రితం… వైసీపీ మాజీ ఎంపీ వరప్రసాద్.. పవన్ ను కలిశారు. అప్పుడు పవన్.. ఈ సారి జగన్ కు మద్దతిస్తానని చెప్పినట్లు ప్రచారం చేసుకున్నారు. దీన్ని పవన్ కల్యాణ్ నేరుగా ఖండించలేదు. పవన్ తో జగన్ పొత్తు పెట్టుకోవాలనేది.. వైసీపీలని కొంత మంది నేతల అభిప్రాయం. కొంత మంది నేతలు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చారని జగన్ కూడా చెప్పుకొచ్చారు. అయితే జగన్ బలాన్ని ఆయన ఓ టీవీ చానల్‌కు ఇచ్చిన ఇంటర్యూలో చీమతో పోల్చారు. జనసేనతో పొత్తు పెట్టుకోవడానికి రెడీనే అంటున్న జగన్… గత ఎన్నికల్లో బీజేపీ- టీడీపీకి ఇచ్చినట్లుగా.. బేషరతుగా ఈ సారి వైసీపీకి ఇవ్వాలని కోరుకుంటున్నారనిచెబుతుననారు.
ప్రత్యేకంగా పోటీ చేయడానికి అసెంబ్లీ, పార్లమెంట్ సీట్లు పవన్‌కు ఇవ్వాలనుకోవడం లేదట. పవన్ కు సీట్లు ఇవ్వాల్సి వస్తే..అవన్ని కచ్చితంగా తెలుగుదేశం పార్టీ అప్పనంగా అప్పగించినట్లేనన్న అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. ఉత్తినే మద్దతివ్వడానికి సిద్ధంగా లేని జనసేన ఇటీవలి కాలంలో జగన్ పై ఓ మాదిరి విమర్శలు ప్రారంభించారారు. జనసేన బేషరతుగా మద్దతు ఇవ్వదని తేలిన తర్వాత జగన్..ఇక తాడోపేడో తేల్చతుకోవాలనుకున్న జగన్… నేరుగా ఎటాక్ చేసినట్లు తెలుస్తోంది. ఎన్నికల్లోపు వీలైనంతగా.. జనసేన ప్రభావాన్ని తగ్గించాలనుకుంటున్నారన్న అభిప్రాయాలున్నాయి. పీఆర్పీ విషయంలో … వైఎస్ రాజశేఖర్ రెడ్డి చేసిన అమలు చేసిన వ్యూహమే ఇది. ఇప్పుడు జనసేన విషయంలో జగన్ అనుసరిస్తున్నారన్న భావన రాజకీయవర్గాల్లో వ్యక్తమవుతోంది.