విశాఖపట్నంలో స్థాపించబోతున్న ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజిమెంట్ శిక్షణా తరగతులు ఈరోజు నుండి మొదలవబోతున్నాయి. ఆంద్ర విశ్వద్యాలయంలో ప్రాంగణంలోనే గల ‘ఆంధ్రా బ్యాంక్ స్కూల్ ఆఫ్ బిజినెస్’ భవనం ఐ.ఐ.ఎం-విశాఖకు తాత్కాలిక క్యాంపస్ గా కేటాయించబడింది. దానిని రాష్ట్ర మానవవనరుల అభివృద్ధి శాఖా మంత్రి గంటా శ్రీనివాసరావు ఈరోజు లాంఛనంగా ప్రారంభిస్తారు. తరువాత లాంచనంగా క్లాసులు మొదలవుతాయి. సెప్టెంబర్ 28నుండి రెగ్యులర్ క్లాసులు మొదలవుతాయి. తరగతులు నిర్వహణ, విద్యార్ధుల వసతి, రవాణా సౌకర్యాలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని ఐ.ఐ.ఎం-విశాఖ మొదటి బ్యాచులో కేవలం 60 మందిని మాత్రమే చేర్చుకొన్నారు. ఐ.ఐ.ఎం-విశాఖకు రెండు లేదా మూడేళ్ళ పాటు ఐ.ఐ.ఎం.-బెంగళూరు మార్గదర్శిగా వ్యవహరిస్తుంది. దాని ద్వారానే 60మంది విద్యార్ధులను ఎంపిక చేయబడ్డారు. ఈ విద్యాసంవత్సరంలో ఐ.ఐ.ఎం-బెంగళూరు అధ్యాపకులే విశాఖకు వచ్చి విద్యార్ధులకు శిక్షణ ఇస్తారు.
విశాఖ శివార్లలో మధురవాడ సమీపంలో గల గంభీరం అనే గ్రామం వద్ద ఐ.ఐ.ఎం-విశాఖ నెలకొల్పబోతున్నారు. దీని శాశ్విత భవనాల నిర్మాణానికి మరొక రెండు మూడేళ్ళ సమయం పట్టవచ్చును. అంతవరకు సమయం వృధా చేయకుండా ఈవిద్యాసంవత్సరం నుండే ఆంద్ర విశ్వద్యాలయంలో తాత్కాలిక భవనంలో శిక్షణా తరగతులు మొదలుపెట్టేస్తున్నారు.