స్కిల్ కేసులో నిధుల మళ్లింపు అంశంలో అసలు చంద్రబాబుకు, ఏపీ ప్రభుత్వానికి సంబంధం లేదని ఈడీ క్లారిటీ ఇచ్చింది. తాజాగా ఈ కేసులో కొన్ని సంస్థల ఆస్తుల్ని జప్తు చేస్తూ ప్రెస్ నోట్ వచ్చింది . అందులో ప్రభుత్వం నుంచి వచ్చిన నిధుల్ని ఏపీలో స్కిల్ సేవలు అందించిన కంపెనీలు షెల్ కంపెనీలకు మళ్లించారని ఆస్తులు జప్తు చేశారు. ఆ షెల్ కంపెనీల్లో చంద్రబాబువి కానీ.. టీడీపీకి సంబంధించిన వారివి కానీ లేవని ఈడీ స్పష్టం చేసింది. అంటే చంద్రబాబుకు క్లీన్ చిట్ ఇచ్చినట్లయింది.
ఒక్క ఆధారం చూపించలేకపోయిన్ జగన్ రెడ్డి సీఐడీ
స్కిల్ కేసులో చంద్రబాబు పేరును రాత్రికి రాత్రి చేర్చి అర్థరాత్రి కర్నూలులో అరెస్టు చేశారు. అక్కడ చేసిన డ్రామా అంతా ఇంతా కాదు. నిధుల దుర్వినియోగం జరిగిందో.. అవినీతి జరిగిందో వాళ్లకే అర్థం కానట్లుగా కేసు కట్టారు. అంతిమంగా అప్పటి సీఐడీ చీఫ్ సంజయ్, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఏం చెప్పారంటే ఈడీ కూడా నోటీసులు ఇచ్చింది. షెల్ కంపెనీలకు నిధులు మళ్లించారు. ఆ షెల్ కంపెనీలు చంద్రబాబువే అని చెప్పారు. విచారణలో ఒక్క కంపెనీని కానీ లేదా చంద్రబాబుకు ఒక్క రూపాయి చేరినట్లుగా కానీ నిరూపించలేకపోయారు. ఈ కారణంగా ఆధారాల్లేవని హైకోర్టు బెయిల్ ఇచ్చింది.
ఈడీ నోటీసులే బూచిగా అరెస్టు
స్కిల్ కేసులో అంతా కళ్ల ముందే ఉంది. కానీ ఆడిటింగ్ కు కూడా కళ్లకు గంతలు కట్టేసి సగం సగం ఆడిటింగ్ చేయించి కీలకమైన విషయాలు దాచి పెట్టి చంద్రబాబును అరెస్టు చేశారు. అవినీతి చూపించండి అంటే… టీడీపీ పార్టీ ఖాతాకు ఎలక్టోరల్ ఫండ్స్ వచ్చాయంటూ అడ్డగోలు వాదనలు చేశారు. చివరికి సుప్రీంకోర్టు ఆదేశాలతో అన్ని పార్టీల ఎలక్టోరల్ ఫండ్స్ వివరాలు బయటకు వచ్చాయి. అందులో స్కిల్ కేసులో చెప్పుకున్న ఒక్క కంపెనీ కూడా టీడీపీకి విరాళం ఇవ్వలేదు. చివరికి సభ్యత్వం ఆదాయాన్ని కూడా స్కిల్ కేసులు డబ్బులు వాదించబోయి బొక్క బోర్లా పడ్డాడు పొన్నవోలు. ఈడీ కేసులు పూర్తిగా ఆాయా కంపెనీలు తమ ఆదాయం నుంచి టాక్స్ కట్టకుండా ఎగ్గొట్టడం కోసం తమ కంపెనీలకు ఫేక్ ఇన్వాయిస్లతో మళ్లించే అంశంలోనే ఉన్నాయి.
తప్పుడు కేసుల లెక్క తేల్చాల్సిందే !
చంద్రబాబుపై పెట్టిన తప్పుడు కేసుల లెక్కను ప్రస్తుత ప్రభుత్వం తేల్చాల్సిందే. తాను సీఎంగా ఉన్నాను కాబట్టి తన కేసుల విషయంలో సమీక్ష చేసుకోవడం నైతికంగా కరెక్ట్ కాదని చంద్రబాబు అనుకుంటారు. కానీ నైతిక విలువల్లేని వ్యక్తులతో పోరాడుతున్నప్పుడు తమను తాము రక్షించుకోవడానికి ప్రత్యర్థులు చేసిన కుట్రల్ని ప్రజల ముందు ఉంచడం అనైతికత కాదు. స్కిల్ కేసు సహా చంద్రబాబుపై పెట్టిన అన్ని కేసుల పూర్తి డీటైల్స్ ప్రజల ముందు పెట్టి …తప్పుడు కేసులు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటే వ్యవస్థలు గాడిలో పడే అవకాశం ఉంది.