ఇంతటి వర్షాలు ఎప్పుడూ చూడలేదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కూడా ఆశ్చర్యపోయారు. గుజరాత్ సీఎంగా చాలా కాలం ఉన్నా.. ఎన్నో విపత్తులను చూశా కానీ ఇప్పుడు పడిన వాన, వరద విలయాన్ని ఎప్పుడూ చూడలేదన్నారు. ఎందుంటే ఇప్పుడు ఒక్క గుజరాత్ లోనే కాదు దేశవ్యాప్తంగా జల విజయం కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ లోని విజయవాడ, తెలంగాణలోని ఖమ్మంలలో ఏం జరిగిందో మన కళ్ల ముందు ఉంది. కానీ దేశ పాలకుడిగా మోదీకి దేశంలో అన్ని చోట్ల జరుగుతున్న జల విలయాన్ని తెలుసుకుంటారు. అందుకే ఆయన కూడా ఆశ్చర్యపోతున్నారు.
క్లౌడ్ బరస్టులతో ఒకే చోట వరద
గత ఏడాది ఎల్ నినో ప్రభావం కారణంగా వర్షాలు పడలేదు. ఈ సారి మాత్రం ఎల్ నినో ప్రభావం లేకపోగా రివర్స్ లో అత్యంత భారీగా వర్షాలు పడుతున్నాయి. ఈ వర్షం అన్ని చోట్లా విస్తరించి పడితే సమస్య ఉండేది కాదు. ఉన్నా… ఎలాగోలా.. మానవ మాత్రులు ఎదుర్కోగలరు. కానీ ఇక్కడ అసలు సమస్య వర్షం అంతా కుప్ప పోసినట్లుగా ఒకే చోట పడటం. దీన్ని క్లౌడ్ బరస్ట్ అంటున్నారు. ఖమ్మంలో అటవీ ప్రాంతంలో జరిగిన క్లౌడ్ బరస్ట్ కారణంగా కొన్ని వేల ఎకరాల్లో అటవీ ప్రాంతం నాశనం అయిపోయింది. కృష్ణా జిల్లాలో జరిగిన క్లౌడ్ బరస్ట్ కరణంగా విజయవాడ నీట మునిగింది. ఖమ్మం, విజయవాడల్లోనే కాదు.. గుజరాత్, ఉత్తరాఖండ్ వంటి అనేక రాష్ట్రాల్లో ఈ క్లౌడ్ బరస్టులు కామన్ అయిపోయాయి. వయనాడ్ల విషాదానికీ క్లౌడ్ బరస్ట్ల కారణం.
విదేశాల్లోనూ ఇదే పరిస్థితి
చైనాలో ఇప్పుడు ఓ వైపు యాగీ అనే ప్రాంతం .. వరదలతో ఉక్కిరి బిక్కిరి అవుతుంది. అసలు వర్షాలే ఉండవని మనం క్లాసు పుస్తకాల్లో చదువుకున్న దుబాయ్ వంటి నగరాలు వరదలతో మునిగిపోతున్నాయి. రాజకీయ తుపానే కాదు బంగ్లాదేశ్ ను మామూలు తుఫాను కూడా అల్లకల్లోలం చేసింది. ప్రపంచంలో ఎక్కడ చూసినా.. ఏదో ఓ మూల ఇలాంటి ప్రకృతి విపత్తులు కనిపిస్తూనే ఉన్నాయి. అంటే ప్రతి ఒక్కరికీ ఈ క్లౌడ్ బరస్ట్ గండం ఉంది. టైమ్ ఆఫ్ మ్యాటర్ అనుకోవాల్సిందే.ప్రకృతిలో వస్తున్న కీలకమైన మార్పు
అనూహ్యమైన వాతావరణ మార్పు
వర్షాలు భారీగా పడటం వేరు… మేఘాలు బద్దలైపోయి… కిందపడిపోవడం వేరు. ఇప్పుడు మేఘాలు కూడా అలా పయనిస్తూవర్షించాలని అనుకోవడం లేదు. దానికి మారిపోతున్న వాతావరణ పరిస్థితులే కారణం అని నిపుణులు విశ్లేషించాల్సిన పని లేదు. మారుతున్న వాతవరణాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మానవుడు స్వార్థం కోసం.. చేసే పనులతో… మానవాళికి ముప్పు ఏర్పడుతుంది. ఇలాంటి క్లౌడ్ బరస్టులు పెను ప్రమాదంగా మారడం ఖాయంగా కనిపిస్తోంది. దీన్ని తప్పించుకోవడానికి కొత్త ప్రయోగాలు.. ప్రయత్నాలు చేయాల్సిందే.
క్లౌడ్ బరస్టులు కామన్ అయిపోతున్నాయి. గత ఏడాది క్లౌడ్ బరస్ట్ జరిగినప్పుడు సీఎంగా ఉన్న కేసీఆర్.. అది విదేశీ కుట్ర అని అనుమానం వ్యక్తం చేశారు. ఒకే చోట అంత భారీ స్థాయిలో వర్షం పడటంతో ఆ డౌట్ వచ్చింది. అందులో నిజం ఉందో లేదో కానీ.. ప్రకృతి మాత్రం ప్రకోపిస్తోదన్నది మాత్రం నిజం.