హైదరాబాద్: ముదితల్ నేర్వగరాని విద్యగలదె….అని కవి ఉవాచ. దానిని కొందరు మహిళలు తప్పుగా అర్థం చేసుకున్నట్లున్నారు. విశాఖపట్నంలో మహిళలు నిర్వహిస్తున్న పేకాట క్లబ్బులు ఇటీవల పోలీసులకు పట్టుబడుతున్నాయి. మర్రిపాలెం, లక్ష్మీనగర్, వివేకానందనగర్ ఏరియాలలో ఈ క్లబ్బులను పోలీసులు పట్టుకున్నారు. ఈ క్లబ్బులలో కొన్ని పూర్తిగా మహిళలకోసమే నిర్వహిస్తుండగా, మరికొన్నిచోట్ల మగవాళ్ళకుకూడా ప్రవేశం కల్పిస్తున్నారని పోలీసులు చెబుతున్నారు. ఈ క్లబ్బులలో ఫుడ్, డ్రింక్‌లను కూడా ఏర్పాటు చేస్తున్నారని తెలిపారు. పోలీసులు దాడులకు వస్తే అప్రమత్తం చేయటానికి ఈ క్లబ్బుల బయట మనుషులనుకూడా పెట్టుకుంటున్నారని వెల్లడించారు.
కాస్మోపాలిటన్ కల్చర్ ఉన్న విశాఖపట్నంలో ఆర్థికనేరాలు మొదటినుంచి ఎక్కువగానే జరుగుతుంటాయి. అయితే ఇప్పుడు మహిళలుకూడా ఇలాంటి నేరాలలో పాలుపంచుకోవటం విశేషం.