ఏపీ సీఎం చంద్రబాబు పక్కా ప్రణాళికలతో ముందుకు వెళ్తున్నారు. గతంలో జరిగిన పొరపాట్లను ఈసారి పునరావృత్తం చేయకుండా పకడ్బందీ ప్లాన్ తో సాగుతున్నారు. ప్రజలకు – ప్రభుత్వానికి మధ్య ఎలాంటి గ్యాప్ ఉండొద్దని పదేపదే నేతలకు సూచిస్తున్న చంద్రబాబు..ప్రజలతో నేతలను భాగస్వామ్యం అయ్యేలా కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నారు.
ఇప్పటికే మంత్రి నారా లోకేష్ చేపడుతోన్న ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన వస్తోంది. నిత్యం వందలాది మంది సమస్యలను లోకేష్ దృష్టికి తీసుకెళ్తున్నారు. సత్వరమే పరిష్కారమయ్యే వాటిని లోకేష్ అక్కడిక్కడే పరిష్కరిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు కూడా వ్యక్తం అయ్యాయి.
ఇది చంద్రబాబు వరకు చేరిందో ఏమో , ఈ కార్యక్రమాన్ని విస్తృతంగా నిర్వహించాలని నిర్ణయించారు. మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో వంతుల వారీగా ప్రజా దర్బార్ నిర్వహించాలని నేతలను ఆదేశించారు. ఈ క్రమంలో కీలక నాయకులు సహా మంత్రులకు ప్రజాదర్బార్ డ్యూటీలు వేశారు. మొక్కుబడిగా కాకుండా మంత్రులు , కీలక నేతలు విధిగా ఉదయం 7 గంటల కల్లా పార్టీ కార్యాలయంలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు.
ప్రజల నుంచి వచ్చే వినతిపత్రాలను స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం కృషి చేసేలా చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని రూపొందించారు. ఈ క్రమంలో తొలిసారి ఆగస్టు నెలకు సంబంధించి మంత్రులకు ప్రజాదర్బార్ డ్యూటీలు వేశారు. ప్రజల వద్దకు పాలనను చేరువ చేసేలా చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారని టీడీపీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
కింది పేర్కొన్న తేదీలలో ఈ నేతలు ప్రజా దర్బార్ లో పాల్గొననున్నారు.
1వ తేదీ: పర్చురి అశోక్బాబు, మాజీ మంత్రి దేవినేని ఉమా
2వతేదీ: మంత్రి గొట్టిపాటి రవికుమార్, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్
3వ తేదీ: సీఎం చంద్రబాబు, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్
5వ తేదీ: మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, బొల్లినేని రామారావు
6వ తేదీ: మంత్రి వంగలపూడి అనిత, బీద రవిచంద్ర యాదవ్
8వ తేదీ: మంత్రి పొంగూరు నారాయణ, మాజీ మంత్రి జవహార్
9వ తేదీ: మంత్రి నిమ్మల రామానాయుడు, టీడీపీ ఏపీ చీఫ్ పల్లా శ్రీనివాస్ యాదవ్
10వ తేదీ: సీఎం చంద్రబాబు, పల్లా శ్రీనివాస్ యాదవ్
12వ తేదీ: మంత్రి ఆనం రామానారాయణ రెడ్డి, వర్ల రామయ్య
13వ తేదీ: మంత్రి టీ.జీ. భరత్, మాజీ ఎమ్మెల్యే వైకుంఠం ప్రభాకర్ చౌదరి
14వ తేదీ: మంత్రి డోలా బాలవీరాంజనేయ స్వామి. కిషోర్ కుమార్ రెడ్డి