సీఎం చంద్రబాబు తనను తాను మార్చుకోవటంలో ముందుంటారు అనేది దగ్గరగా చూసిన వారి మాట. తాజాగా సీఎం తీసుకున్న నిర్ణయం నిజమే అనిపిస్తోంది.
సీఎంగా ఎవరున్నా ఆయా పార్టీల నేతలు, ప్రజలు కొందరు కాళ్లకు నమస్కారం చేస్తుంటారు. తెలుగులోనూ ఈ ఆనవాయితీ ఉన్నా తమిళనాడు అంత ఉండదు. కానీ, కాళ్లకు దండం పెట్టకుండా ఎంత వారించినా అవి ఆగవు.
అయితే, తాజాగా సీఎం చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకున్నారు. ఇక నుండి తన కాళ్లకు ఎవరూ దండం పెట్టవద్దని విజ్ఞప్తి చేశారు. తల్లితండ్రులకు, భగవంతుడికి దండం పెట్టాలి తప్పా నాయకులకు కాదని… తాను సేవకుడిని అని స్పష్టం చేశారు. ఇక నుండి తన కాళ్లకు ఎవరైనా దండం పెడితే… తాను కూడా తిరిగి వారి కాళ్లకు దండం పెడుతానని స్పష్టం చేశారు.
ఆ సంస్కృతి మంచిది కాదని, దాన్ని నిలువరించేందుకే తాను కూడా దండం పెడతానన్న నిర్ణయానికి వచ్చినట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. టీడీపీ కార్యాలయంలో విలేకరులతో చిట్ చాట్ చేసిన సీఎం… ఈ విషయాన్ని తానే స్వయంగా వెల్లడించారు.