పోలవరం ప్రాజెక్ట్ అనేది ఏపీ జీవనాడి. కేంద్రం వంద శాతం నిధులతో నిర్మించుకోమని జాతీయ హోదా ఇస్తే కళ్లు మూసుకుని నిర్మాణాలు పూర్తి చేయాల్సిన ప్రాజెక్టును జగన్ రెడ్డి తన అహానికి బలిచ్చారు. చంద్రబాబు హయాంలో అన్ని అనుమతులు తెచ్చుకుని 70 శాతానికిపైగా పూర్తి చేస్తే.. తన ఐదేళల కాలంలో కనీసం మొత్తం ఖర్చు పెట్టకుండా ప్రాజెక్టును వరదలకు వదిలేశారు. ఫలితంగా గైడ్ బండ్, కాపర్ డ్యాం, స్పిల్ వే అన్నీ పాడైపోయాయి.
అధికారంలోకి రాగానే.. తప్పుడు నివేదికలు ఇప్పించుకుని అవినీతి జరిగిపోయిందని గగ్గోలు పెట్టారు. అవే కేంద్రానికి పంపారు. ఆధారాలు ఇవ్వలంటే… అబ్బే అవినీతి లేదన్నారు. కానీ ఆ కారణం చెప్పి కాంట్రాక్టర్ ను మార్చేశారు. కేంద్రం తప్పు చేస్తున్నావు అని గట్టిగా అడిగినా మాట వినలేదు. మేఘా రెడ్డికి ఇచ్చారు. ప్రాజెక్టులో అడుగు ముందుకు పడలేదు. ఇప్పుడు పాడైపోయిన వాటిని ఎలా సర్దుబాటు చేయాలో తెలియని పరిస్థితి.
అధికారంలోకి వచ్చాక అరపర్సెంట్… పర్సెంటా అని.. మరో ఏడాదిలో పూర్తి చేస్తామని అసెంబ్లీలో మంత్రులు తొడలు కొట్టారు. తీరా చూస్తే .. ఎప్పుడు పూర్తి చేస్తామో తెలియదని చేతులెత్తేశారు. మొన్నటి మేనిఫెస్టోలో వచ్చే ఐదేళ్లలో పూర్తి చేస్తామన్నారు. గత ఐదేళ్లలో వాలంటీర్ల మీద పెట్టిన ఖర్చు పోలవరం మీద పెడితే మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యేది.
చంద్రబాబునాయుడు పోలవరం పర్యటనకు వెళ్తే… పరిస్థితి చూసి బాధపడ్డారు. 2020లో పూర్తి కావాల్సిన ప్రాజెక్టుకు ఈ పరిస్థితి కల్పించారని ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి కావాలంటే మరో నాలుగు సీజన్లు పడుతుందని అధికారులు చెప్పారన్నారు.