హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టిస్తోన్న కాల్‌మనీ రాకెట్‌పై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు స్పందించారు. ఇవాళ విజయవాడలో జరిగిన కలెక్టర్ల సమావేశంలో మాట్లాడుతూ, కాల్‌మనీ వ్యవహారం చాలా దారుణం అక్రమమని వ్యాఖ్యానించారు. నిందితులు ఎంతటివారైనా చర్యలు తీసుకుంటామని అన్నారు. అప్పులు తీసుకున్నవారు ఎవరూ కూడా డబ్బులు తిరిగి చెల్లించొద్దని సూచించారు. కాల్‌మనీ నిందితులు బాధితులు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని అన్నారు. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కలెక్టర్లకు సూచించారు. వేరేవాళ్ళు ఇలాంటి పనులు చేయాలంటే భయపడేటట్లుగా తీవ్రంగా శిక్షించాలని అన్నారు. కల్తీ నెయ్యి, కల్తీ మద్యం, కాల్‌మనీ వంటి ఘటనలు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఇమేజ్ను దెబ్బతీస్తాయని చంద్రబాబు చెప్పారు. పోలీసులు, కలెక్టర్లు అప్రమత్తంగా ఉంటే ఇలాంటి ఘటనలను ఆదిలోనే అణచివేయొచ్చని అన్నారు. కాల్‌మనీ నెపం పెట్టుకుని ఎవరైనా మహిళలను వేధించినట్లు తెలిస్తే కఠినంగా శిక్షించాలని ఆదేశించారు. ఈ విషయంలో రాజీపడేది లేదని చెప్పారు.