అధికారులు ఎవరైనా అలర్ట్ గా ఉండాల్సిందే… ప్రజా సంక్షేమం విషయంలో రాజీ పడేది లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. 1995లో తాను సీఎం అయిన వెంటనే హైదరాబాద్ లో తాను స్టార్ట్ అవుతున్నానంటే అధికారులంతా జిల్లాల్లో అలర్ట్ గా ఉండేవారని, ఆనాటి సీబీఎన్ 1.0ను ఇప్పుడు చూస్తారన్నారు.
అయితే, అధికారులు భయపడాల్సిందేమీ లేదని… తమ పని తాము చేస్తే ఎలాంటి ఆందోళన అవసరం లేదని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు.
అధికారులు ఇంకా సెట్ కాలేదని మంత్రి నారా లోకేష్ అనగా… అందరూ సెట్ అవుతారని సీఎం చంద్రబాబు స్పష్టం చేశారు. పరదాల విషయంలో అధికారులు పాత పద్ధతినే సాగిస్తున్నారని మంత్రి లోకేష్ బాబు దృష్టికి తీసుకరాగా… అందరూ సెట్ అవుతారని, రిపీట్ అయితే సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. దీంతో చంద్రబాబు, లోకేష్ సహా అక్కడున్న వారంత నవ్వుకున్నారు.