విభజన హామీలు అమలు చేయకుండా… కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై.. నోరెత్తలేని తమ నిస్సహాయతను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరోసారి బయట పెట్టుకుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డికి మద్దతు ఎప్పుడూ మాట్లాడే మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్.. ఏపీకి కేంద్రం చేసిన అన్యాయంపై… చర్చించేందుకు మంగళవారం విజయవాడలోని ఐలాపురం హోటల్లో అఖిలపక్షం, మేధావుల సమావేశం ఏర్పాటు చేసారు. సమావేశానికి హాజరుకావాలని అన్ని పార్టీలకు ఆయన లేఖలు రాశారు. ఈ లేఖ టీడీపీ అధినేతకు కూడా చేరింది.చంద్రబాబు.. టీడీపీ తరపున సీఎం రమేష్, మంత్రి ఆనందబాబును పంపాలని నిర్ణయించారు. జనసేన, కాంగ్రెస్, బీజేపీ, సీపీఐ, సీపీఎం పార్టీలు కూడా హాజరవుతున్నాయి.
రాష్ట్ర సమస్యలపై.. బీజేపీ చేసిన అన్యాయంపై స్పందించేందుకు… అన్ని పార్టీలు ముందుకు వచ్చాయి. కానీ వైసీపీ మాత్రం.. వచ్చే ప్రశ్నే లేదని తేల్చి చెప్పింది. దానికి కారణంగా.. అరిగిపోయిన రికార్డు లాంటి సమాధానం ఇచ్చింది. అదేమంటే.. టీడీపీతో కలిసి వేదికను పంచుకోలేరకట. ఆ సమావేశం టీడీపీ ఏర్పాటు చేయలేదు… స్వయంగా వైసీపీకి ఆప్తమిత్రుడిగా వ్యవహరిస్తున్న ఉండవల్లే ఏర్పాటు చేశారు. అయినప్పటికీ.. వైసీపీ. టీడీపీని కారణంగా చూపి.. సమావేశాన్ని బహిష్కరించింది. సమావేశానికి వెళ్తే.. కేంద్రం గురించి మాట్లాడాల్సి వస్తుందని.. వైసీపీ నేతలు.. భావించినట్లు ఉన్నారు. కేంద్రం చేసిన అన్యాయంపై గళమెత్తితే.. కేంద్రంలోని పెద్దలకు ఎక్కడ కోపం వస్తుందోనన్న భయం జగన్ కు వెంటాడుతోందంటున్నారు. అదే సమయంలో సమావేశానికి వెళ్లి తామేమీ మాట్లాడకపోయినా.. వెళ్లిన వారంతా.. కేంద్రం తీరును తీవ్రంగా దుయ్యబడతారు.. ఆ సమయంలో.. తమ మౌనం కూడా సమర్థింపుగానే ఉంటుంది కాబట్టి.. ఆ రిస్క్ కూడా తీసుకోకూడదని..వైసీపీ భావించింది. సమావేశానికి హాజరై.. బీజేపీని ఏమీ అనకుండా.. రాజకీయం ప్రకారం.. టీడీపీని విమర్శిస్తే.. అసలు ఇవ్వాల్సిన వాళ్లను వదిలేసి.. సొంత రాష్ట్రంపై దాడి ఏమిటన్న విమర్శలు వస్తాయి. అందుకే.. ఎందుకొచ్చిన బాధ… ఊరుకున్నంత ఉత్తమం.. బోడిగుండంత సుఖం అని జగన్ ఫీలయ్యారని తెలుస్తోంది.
వైసీపీ తీర గత నాలుగున్నరేళ్ల కాలంలో ఇంతే ఉంది. ప్రత్యేకహోదా దగ్గర్నుంచి ప్రతీ అంశంలోనూ కేంద్రంపై పోరాడుతున్నామంటారు కానీ… నేరుగా.. ఒక్కటంటే.. ఒక్క మాట కూడా.. మోడీని కానీ.. బీజేపీని కాని అని ఉండరు. పార్లమెంట్ లోనూ… ప్రశ్నించలేదు. అక్కడా సందర్భం వచ్చే సరికి రాజీనామాుల చేసి బయటపడిపోయారు. అసెంబ్లీ నుంచి బాయ్ కాట్ చేశారు. బహిరంగ వేదికల్లోనూ బీజేపీకి వ్యతిరేకంగా ఒక్క మాట మాట్లాడరు. చివరికి… శ్రేయోభిలాషులు.. వారిని మారుద్దామని చేసే ప్రయత్నాలను కూడా వారు నిర్వీర్యం చేస్తున్నారు. ఇంక వైసీపీపై బీజేపీ ముద్ర … ఎలా చెరిగిపోతుంది..?
30న చంద్రబాబు అఖిలపక్షం..! వైసీపీ, జనసేనలు వస్తాయా..?
విభజన సమస్యలు, కేంద్రం మోసంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో సారి అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేస్తోంది. ఎన్నికలకు ముందు ఢిల్లీ సర్కార్ పై ఓ రేంజ్ యుద్ధం చేయాలనుకుటున్న చంద్రబాబు.. ఇందు కోసం అందర్నీ కలుపుకుని వెళ్లాలనుకుంటున్నారు. అందులో భాగంగానే మరోసారి అఖిలపక్ష సమావేశం పెట్టారు. పార్లమెంట్ సమావేశాలకు మించిన.. అవకాశం మళ్లీ దొరకదు కాబట్టి.. దాన్నే చంద్రబాబు… తన పోరాటానికి వేదికగా చేసుకున్నారు. తన పోరాటంపై.. అన్ని పక్షాల అభిప్రాయం తెలుసుని.. వారిని కూడా.. తనతో పాటు ఢిల్లీ తీసుకెళ్లే అవకాశం ఉంది. పార్లమెంట్ సమావేశాల చివరి రోజున.. చంద్రబాబు ఎలాగూ దీక్ష చేయాలనుకుంటున్నారు కాబట్టి.. అందర్నీ కలుపుకుని.. ఆ దీక్ష చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. చంద్రబాబు దీక్షకు అందరు జాతీయ నేతలు మద్దతు తెలుపుతారు.. సహజంగానే ఇది దేశం దృష్టిని ఆకర్షిస్తుంది.
అఖిలపక్షల భేటీకి..ఇప్పటికే అందరికీ ఆహ్వానాలు పంపారు. వైసీపీ తప్ప అన్ని పార్టీలు హాజరయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఉండవల్లి ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీకి కూడా… వైసీపీ రాలేమని చెప్పింది. ఇక ప్రభుత్వం నిర్వహించే సమావేశానికి వచ్చే అవకాశం లేదు. అదే సమయంలో పవన్ కల్యాణ్ కానీ.. ఆయన పార్టీ తరపున ఇతరులు కానీ హాజరయ్యే అవకాశం ఉంది. ఇటీవలి కాలంలో.. అఖిలపక్షం పెట్టాలని పవన్ కల్యాణే స్వయంగా పలుమార్లు డిమాండ్ చేశారు. గుంటూరు శంఖారావం సభలోనూ… పవన్ కల్యాణ్… కలసి పోరాడాలని అందరికీ పిలుపునిచ్చారు. విభజన సమస్యల కోసం కలసి పోరాడదాం.. ఎవరికి వారు పోటీ చేద్దాం అనే ఫార్ములా చెప్పారు. ఆ ప్రకారం అఖిలపక్ష సమావేశానికి జనసేన హాజరవడం ఖాయమే.
విభజన హామీల అమలుపై ఫిబ్రవరి ఒకటిన ఏపీ బంద్‌కు హోదా సాధన సమితి పిలుపునిచ్చింది. ఈ బంద్‌కు టీడీపీ కూడా మద్దతు ప్రకటించింది. అటు అఖిలపక్ష సమావేశంలోని నిర్ణయాలు, ఇటు ఏపీ బంద్‌తో ప్రజల మనోభావాలను ఢిల్లీకి వినిపించాలని టీడీపీ భావిస్తోంది. మంగళవారం విభజన హామీల అమలుపై ఉండవల్లి అరుణ్‌కుమార్ ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలనూ ఆహ్వానించారు. అయితే ఈ సమావేశానికి రాబోమని వైసీపీ ఇప్పటికే తెలిపింది. టీడీపీ నుంచి సోమిరెడ్డి, ఆనంద్‌బాబు హాజరవుతున్నారు. జాతీయ స్థాయిలో మోదీకి వ్యతిరేకంగా ఇప్పటికే చంద్రబాబు అన్ని పార్టీల మద్దతు కూడగడుతున్నారు. పార్లమెంట్ సమావేశాలు ఇవే చివరివి కావడంతో దీక్షకు దిగాలని నిర్ణయించారు. తద్వారా అటు ఏపీ సమస్యలను, ఇటు మోడీ ప్రభుత్వ తీరును ఎండగట్టినట్టవుతుందని టీడీపీ భావిస్తోంది.