నా ప్రియమైన తెలుగింటి ఆడపడుచులకు, అనునిత్యం ఆశీస్సులు కురిపించే అక్కచెల్లెళ్లకు రాఖీ పండుగ శుభాకాంక్షలు… తెలుగుదేశం పార్టీ మొదటి నుండి ఆడబిడ్డల పక్షపాతి, మహిళలకు ఆస్తిలో సగం వాటాతో పాటు ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఆడవారి పేరిట ఇవ్వటాన్ని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు.
మహిళల కోసం డ్వాక్రా పథకాలు, బాలికలకు విద్యనందించటం, మహిళా రిజర్వేషన్లకు తమవంతు సహయం వంటి అంశాలతో మహిళా చైతన్యానికి టీడీపీ చేసిన కృషితో పాటు ఆడబిడ్డల ఆత్మగౌరవానికి ఇక ముందు కూడా తెలుగుదేశం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.
మహిళల కోసం ఈ ప్రభుత్వం అండగా ఉంటుంది… అన్ని వేళలా, అన్ని రంగాల్లో మీకు అండగా ఉంటానని ఈ రక్షా బంధన్ సమయాన మాటిస్తున్నానని చంద్రబాబు తెలిపారు.
ఇక రక్షాబంధన్ రోజున డిప్యూటీ సీఎం పవన్ తనదైన శైలిలో స్పందించారు. అన్న చెల్లెలి అనురాగానికి ఏమిస్తే రుణం తీరుతుంది… విప్లవ కవి గద్దరన్న పాటను గుర్తు చేసుకున్నారు. నీ పాదం మీద పుట్టమచ్చనైనప్పుడో… అక్క నుదిటి మీద తిలకంగా అలంకృతమైనప్పుడే ఆ రుణం తీరుతుందేమోనన్నారు.
అన్న తమ్ముల అనుబంధానికి ఏరకంగా వెలకట్టగలరు… వీరికి జీవితాంతం గుండెల్లో గుడికట్టి పూజించటం తప్పా అంటూ ఎమోషనల్ గా స్పందించారు.