ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనా తీరు… ప్రభుత్వ ఉన్నతాధికారులను రెండు వర్గాలుగా మార్చేసింది. సీఎం అనుకూల వర్గం.. సీఎం వ్యతిరేక వర్గంగా మారిపోయాయి. సీఎం పొలిటికల్ ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్ కారణంగా… సీఎంపై సానుకూలత ఉన్నప్పటికీ..ఆయనకు వ్యతిరేకమైన వారి సంఖ్య.. ఎక్కువగా ఉంది. దానికి.. సోమవారం సచివాలయంలో జరిగిన పరిణామాలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం.. ప్రవీణ్ ప్రకాష్‌కు.. షోకాజ్ నోటీసులు జారీ చేసినప్పుడే… ఓ సంచనాత్మకమైన ఘటన జరగబోతోందని.. అధికారవర్గాలకు అర్థమైంది. అయితే.. ప్రవీణ్ ప్రకాష్.. లేకపోతే.. సీఎస్ .. ఇద్దరిలో ఎవరో ఒకరికి డోర్స్ చూపించక తప్పని పరిస్థితి ఏర్పడింది. సీఎం ఎటు వైపు ఉంటారోననే ఆసక్తి ఉద్యోగవర్గాల్లో ఏర్పడింది.
ముఖ్యమంత్రి కార్యాలయానికి, చీఫ్ సెక్రటరీకి మధ్య నెలకొన్న వివాదంలో చివరకు సీఎం కార్యాలయం ప్రిన్సిపల్ సెక్రటరీ ప్రవీణ్ ప్రకాష్‌దే పైచేయి అయ్యింది. సోమవారం ఉదయం నుంచి వేగవంతంగా జరిగిన పరిణామాల నేపథ్యంలో సాయంత్రం మూడున్నర గంటల సమయంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యాన్ని బదిలీ చేశారు. అంతకు ముందు .. అధికారవర్గాల్లో విస్తృతమైన చర్చలు జరిగాయి. కొంతమంది ఐఏఎస్ అధికారులు.. ప్రవీణ్ ప్రకాష్ వ్యవహారశైలిపై చర్చలు జరిపారు. ఐఏఎస్ అధికారుల సంఘం సమావేశం ఏర్పాటు చేయాలని భావించారు. ఈలోపే మధ్యాహ్నానానికి సీఎస్ ను బదిలీచేస్తూ ఏకంగా జీవో విడుదలైంది.
ఇప్పటికే.. గత ప్రభుత్వం టీడీపీ హయాంలో.. కీలక పోస్టులు పొందిన కొంత మంది సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల్ని జగన్ దూరం పెట్టారు. ఏ ప్రభుత్వం ఉన్నా.. అక్కడ కొంత మంది కీలక బాధ్యతల్లో ఉంటారని.. అందుకని.. వారందర్నీ ఆయా పార్టీలకు అంటగట్టేయడం కరెక్ట్ కాదన్న ఆలోచన.. జగన్ చేయలేకపోయారు. ఆ కారణంగా.. కొంత మంది ఉన్నతాధికారులకు దూరమయ్యారు. ఎల్వీతో వ్యవహారశైలి కారణంగా. . మరికొంత మంది దూరమయ్యారు. ప్రవీణ్ ప్రకాష్ తాను మాత్రమే అన్నట్లుగా.. మిగతా వారిని దూరం చేస్తున్నారు. పరిస్థితి చూస్తూంటే.. జగన్మోహన్ రెడ్డి కోటరిలో చాలా తక్కువమంది మాత్రమే మిగిలే అవకాశం కనిపిస్తోంది.