టీటీడీ చైర్మన్ గా చివరి రోజుల్లో అయినా బీసీలకు చాన్సిస్తామని ప్రచారం చేసుకున్నారు. జంగా కృష్ణమూర్తి అనే బీసీ నేతకు ఆశలు కల్పించారు. చివరికి జగన్ రెడ్డి బంధువర్గానికే ఆ పదవిని కట్ట బెట్టారు. తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తూ సీఎం జగన్ నిర్ణయం తీసుకున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైవీ సుబ్బారెడ్డి చైర్మన్ గా ఉన్నారు. ప్రస్తుతం భూమనకు రెండేళ్లు పదవి కాలం అని ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ ప్రభుత్వం మారితే ఆయనను గెంటేయడం ఖాయం.
తెలుగుదేశం పార్టీ హయాంలో టీటీడీ చైర్మన్లుగా బీసీలకు అవకాశం కల్పించారు. అయితే అలాంటి వారికి అవకాశం కల్పించినప్పుడల్లా వైసీపీ ఏదో వివాదం లేవనెత్తేది. సుధాకర్ యాదవ్ కు అవకాశం కల్పించినప్పుడు ఆయన ఓ క్రిస్టియన్ సమావేశానికి వెళ్లారని బీజేపీ నేతలతో కలిసి రచ్చ చేశారు. క్రిస్టియన్ కూటముల్లో పాల్గొనే వారికి ఇప్పుడు టీటీడీ చైర్మన్ పదవులు ఇస్తున్నా ఎవరూ కిక్కురుమనడం లేదు. భూమన కుమార్తె పెళ్లి క్రిస్టియన్ పద్దతిలో కూడా జరిగింది.
భూమన అసలు దేవుడు లేడని ఘాటు వ్యాఖ్యలు చేసిన సందర్భాలు ఉన్నాయి. పూర్వశ్రమంలో ఆయన రాడికల్ గ్యాంగుల్లో పని చేశారు. అయితే.. తాను ఇక రాజకీయాల నుంచి విరమించుకుంటానని తన కుమారుడికి సీటివ్వాలని.. తనకు టీటీడీ చైర్మన్ పోస్టు ఇవ్వాలని జగన్ రెడ్డిపై ఒత్తిడి తెచ్చి మరీ పోస్టు దక్కించుకున్నారు. చెవిరెడ్డి కూడా ప్రయత్నించారు. వైసీపీ హయాంలో అన్ని ప్రాధాన్యత పదవులు.. రెడ్డి సామాజికవర్గానికి ఎక్కువగా జగన్ రెడ్డి బంధులకే దక్కుతున్నాయి. మిగతా అన్ని వర్గాలు అన్యాయమైపోతున్నాయి. కానీ పేదలు.. పెత్తందార్ల పేరుతో .. జగన్ రెడ్డి మాత్రం బహిరంగసభల్లో వీరలెవల్లో నటించేస్తూంటారు.