సీఎం జగన్మోహన్ రెడ్డి పని తనం ఏమిటో ఈ ఐదేళ్లలో ప్రజలు చూశారు. కూల్చడమే తప్ప కట్టని పని తనం చూశారు. కట్టక కట్టక.. ఫ్లోటింగ్ బ్రిడ్జి కడితే .. ఏమయిందో కళ్ల ముందే ఉంది. అది పనికి రాదని పక్కన పెట్టేశారు. ఇక ఓపెనింగ్ చేయడం లేదని బోర్డు పెట్టారు. ఇలాంటి పనితనం కళ్లముందే ఉన్నా.. ఎన్నికలకు వెళ్లే ముందు తాను చేసే అభివృద్ధి .. ఓ రేంజ్ లో ఉంటుందని గ్రాఫిక్స్ చూపించాలని తాపత్రాయపడ్డారు. తాము గతంలో గ్రాఫిక్స్ విషయంలో చేసిన ట్రోలింగ్స్ అన్నీ మర్చిపోయి తాము కూడా గ్రాఫిక్స్ రిలీజ్ చేసేశారు.
సీఎం జగన్ విశాఖ విజన్ పేరుతో విడుదల చేసిన గ్రాఫిక్స్ చూసి.. వైసీపీ వాళ్లు కూడా నవ్వుకుంటున్నారు. గ్రాఫిక్స్ బాగున్నాయంటూ సెటైర్లు వేసుకుంటున్నారు. విశాఖలో విజన్ విశాఖ అనే మీటింగ్ పెట్టి.. అమరావతిపై విషం చిమ్మారు. అక్కడ లక్ష కోట్లు పెట్టుబడులు పెట్టాలన్నారు. కానీ.. ఇదే జగన్ పదేళ్లలో విశాఖలో లక్షా ఐదు వేల కోట్లు పెడతామన్నారు. విశాఖకు అన్నీ ఉన్నాయి.. ఏవో కొన్ని కడితే సరిపోతాయన్నారు. కానీ లక్షా ఐదువేల కోట్లు పెడతామనడమే ఆశ్చర్యం.
అమరావతికి ఏడాదికి ప్రభుత్వం పెద్దెనిమిది వందల కోట్లు పెడితే..మిగతా అంతా.పెట్టుబడుల రూపంలో ప్రైవేటు వ్యక్తులు పెడతారు. ఆ విషయం మాస్టర్ ప్లాన్లో ఉంది. అయినా అబద్దాలు చెప్పుకుంటూ ఒక ప్రాంతానికి.. మరో ప్రాంతానికి మధ్య చిచ్చు పెట్టేలా రాజకీయం చేస్తున్నారు. ఐదేళ్లలో కొంచెం అయినా పని చేసి ఉంటే.. ఏదో ఒకటి అభివృద్ది చేసి ఉంటే.. ప్రజలు కనీసం నవ్వుకోకుండా ఉండేవారేమో ?