ఓటమికి బంధువులు ఎవరూ ఉండరు కానీ.. విజయానికి మాత్రం అందరూ చుట్టాలే. కాంగ్రెస్ లాంటి రాజకీయ పార్టీలో అయితే.. ఇది మరీ ఎక్కువ. సొంతంగా సర్పంచ్‌గా గెలవలేని వాళ్లు… ఫలానా నేతను.. గెలిపించానని క్రెడిట్ తీసేసుకోగలరు. ఫలానా నేతకు టిక్కెట్ ఇస్తే…యాభై వేల మెజార్టీ తెప్పిస్తామని సులువుగా హామీ ఇచ్చేయగలరు. ఆ లీడర్ల స్టేచర్ ఎమిటీ..? వాళ్లు అంత కాన్ఫిడెంట్‌గా ఎందుకు మాట్లాడుతున్నారు..? అన్న డౌట్స్.. వస్తే.. దానికి.. ఒక్కటే సమాధానం .. అదేమిటంటే… “కాంగ్రెస్ పార్టీ”. కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడూ.. పదవుల కోసం..ఓ రేస్ నడుస్తూ ఉంటుంది. ఒకరు ముందుకు వెళ్తూ ఉంటే.. మరో నలుగురు వెనక్కి లాగుతూ ఉంటారు. అలాంటి వారితో కాంగ్రెస్ తనదైన మార్క్ ప్రజాస్వామ్యాన్ని అనుభవిస్తూ ఉంటుంది.
తాజాగా తెలంగాణ ఎన్నికల్లోనూ.. అదే పరిస్థితి ఉంది. ఇప్పుడిప్పడే ప్రచారపర్వం ఊపందుకుంటోంది. తమ తమ గెలుపు కోసం ప్రయత్నిస్తున్న నేతలు.. నియోజకవర్గాల్లో ప్రచారాలు చేసుకుంటున్నారు. ఒక్క రేవంత్ రెడ్డి.. తెలంగాణ మొత్తం తిరిగి ప్రచారం చేస్తున్నారు. పీసీసీ చీఫ్… హైదరాబాద్ స్థాయిలో రాజకీయ కార్యక్రమాలు చక్క బెడుతున్నారు. వీరిద్దరూ రెండు రోజుల వ్యవధిలో మీడియాతో మీట్‌ది ప్రెస్ నిర్వహించారు. రెండింటిలోనూ.. వీరు తమ గురి.. ముఖ్యమంత్రి పీఠంపైనే అని చెప్పారు. అయితే అది నేరుగా లేరు. పరోక్షంగా ఉంది. తనకు మంత్రిగా చేసిన అనుభవం లేకపోయినా.. పాలించగలనని… కౌంటర్లు ఇవ్వడమే కాదు.. రూలింగ్ చేయడం కూడా వచ్చునని రేవంత్ రెడ్డి స్వయం సర్టిఫికెట్ ఇచ్చేసుకున్నారు. రాబోవు రోజుల్లో కొడంగల్ నియోజకవర్గ ప్రజలు తెలంగాణ రాజకీయాల్లో “ముఖ్య” భూమి నిర్వహిస్తారంటూ. చెబుతూ ఉంటారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఏ మాత్రం తగ్గలేదు. ఏకంగా.. పీసీసీ చీఫ్ గా..ఎన్నికల బాధ్యత మొత్త తనదేనన్నారు. ఓడినా…గెలిచినా బాధ్యత తనదేనని తేల్చి చెప్పారు. ఓడితే డిసెంబర్ 11 తర్వాత గాంధీభవన్‌కు రానని శపథం చేశారు. ఉత్తమ్ ఈ శపథం వెనుక ఉన్నది… క్రెడిట్ తీసుకోవడమే. ఓడిపోతే చేసేదేమీ ఉండదు.. గెలిస్తే.. మాత్రం.. ముందుగా… అంతా నేనే చేశానని చెప్పుకున్నానను కాబట్టి.. కిరీటం తన దగ్గరకు వస్తుందనేది.. ఉత్తమ్ భావన.
ప్రజాకూటమి గెలుస్తుందన్న నమ్మకం పెరుగుతున్న కొద్దీ.. కాంగ్రెస్ పార్టీలో ఈ తరహా కుమ్ములాటలు ఎక్కువైపోతాయి. దీనిపై.. టీఆర్ఎస్ పదే పదే విమర్శలు చేస్తోంది. కాంగ్రెస్ పార్టీలో 40 మంది సీఎం అభ్యర్థులున్నారని… వారొస్తే నెలకో సీఎం మారుతారని సెటైర్లు వేస్తూంటారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత .. దీనిపై… ఎలాంటి కుస్తీలు పడినా పెద్దగా…ఎఫెక్ట్ ఉండదు కానీ.. ఎన్నికల ముందే రచ్చే చేస్తే మాత్రం.. ఓటర్లపై ప్రభావం చూపడం ఖాయం.