సినీ నటుడు తొట్టెంపూడి వేణు డైరక్టర్ గా ఉన్న కంపెనీ తమకు రావాల్సిన డబ్బులను ఎగ్గొట్టిందని.. ఆరోపిస్తూ బీజేపీ ఎంపీ సీఎం రమేష్ కుటుంబానికి చెందిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కోర్టుకు వెళ్లింది. అన్ని వివరాలు పరిశీలించిన కోర్టు కంపెనీ డైరక్టర్లపై కేసులు నమోదు చేయాలని ఆదేశించింది. ఈ మేరకు వేణు తొట్టెంపూడిపై కూడా కేసు నమోదు అయింది.
వేణు డైరక్టర్ గా ఉన్న ప్రొగ్రెసిస్ కన్స్ట్రక్షన్స్ ఉత్తరాఖండ్లో ఓ విద్యుత్ ప్రాజెక్టు కాంట్రాక్ట్ దక్కించుకుంది. ఆ కంపెనీ కొన్ని సివిల్ పనుల్ని రిత్విక ప్రాజెక్ట్స్ కు సబ్ కాంట్రాక్ట్ ఇచ్చింది. అయితే హఠాత్తుగా ఈ ఒప్పంద నుంచి ప్రోగ్రెసివ్ కన స్ట్రక్షన్స్ వైదొలిగింది. అప్పటి వరకూ చేసిన పనులకు టెండర్ ఇచ్చిన వారి దగ్గర డబ్బులు వసూలు చేశారు. కానీ పనులు చేసిన రిత్విక్ ప్రాజెక్ట్స్ కంపెనీకి చెల్లించలేదు. ఆ మొత్తం దాదాపుగా వెయ్యి కోట్లని అంచనా. ఎన్ని ప్రయత్నాలు చేసినా వినకపోవడంతో రిత్విక సంస్థ కోర్టును ఆశ్రయించింది.
ఈ వివాదంపై అటు వేణు కానీ.. ఇటు రిత్విక్ సంస్థ కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. వేణు మథుకాన్ గ్రూప్ నకు చెందిన నామా నాగేశ్వరరావు బావమరిది. ఆయన కూడా ఏపీలోని రాజకీయ కుటుంబానికి చెందినవారే. సీఎం రమేష్ ప్రారంభించిన రిత్విక్ సంస్థ బడా కాంట్రాక్ట్ సంస్థల్లో ఒకటిగా పేరు తెచ్చుకుంది.