అనకాపల్లిలో సీఎం రమేష్ నాన్ లోకల్ అయినా తనదైన వ్యూహంతో వార్తల్లో ఉంటున్నారు. ఓ టీడీపీపీ సానుభూతిపరుడి దుకాణంపై జీఎస్టీ అధికారులు దాడులు చేయడంతో.. వారిని అడ్డుకుని హైలెట్ అయ్యారు. ఆయనపై కేసులు నమోదయ్యాయి. అయితే ఇదే ప్లస్ పాయింట్ గా తీసుకుని వైఎస్ రమేష్.. రెడ్ల దౌర్జన్యన్ని అడ్డుకునేందుకు తాను ఉన్నానంటూ… ప్రజలకు భరోసా ఇస్తునన్నారు. మీడియా సమావేశం పెట్టిన ఆయన .. అక్రమాలను ఎదిరించడానికి మరొక జలగం వెంగళరావు ను అవుతానని ప్రకటించారు.
రెడ్ల దౌర్జన్యాన్ని ఎర్రన్నాయుడు, వెంగళరావు లు అడ్డుకున్నట్టు అడ్డుకుంటానని శపథం చేశారు. వ్యూహాత్మకంగానే సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేశారని భావిస్తున్నారు. అనకాపల్లి పరిధిలో వెలమ వర్గం వ్యాపారస్తులుగా ఉన్నారు. వైసీపీ హయాంలో వారిపై రెడ్ల దౌర్జన్యం పెరిగిపోయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతున్న సమయంలో సీఎం రమేష్ ఈ వ్యాఖ్యలు చేసినట్లుగా తెలుస్తోంది.
తనను స్థానికుడు కాదంటున్న వారికి ఆయన గట్టిగానే సమాధానం ఇస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికలలో స్థానికతకంటే సమర్ధత కే ఓటు అని స్పష్టం చేశారు. పీవీ నరసింహారావు ఒడిశా, నంద్యాలలో పోటీ చేశారు, నీలం సంజీవ రెడ్డి ఎక్కడెక్కడో పోటీ చేసి విజయం సాధించారని గుర్తు చేసుకున్నారు. పులివెందుల లో తాగునీటి కి నా ఎంపీ ల్యాడ్స్ నిధులు ఎక్కువ ఇచ్చానన్నారు. తనపై ఆర్థిక ఆక్రమాల ఆరోపణలపైనా స్పందించారు. బ్యాంకు రుణాల ఎగవేత, ఫోర్జరీ కేసులు ఉన్నట్టు నిరూపిస్తే పోటీ నుంచి విరమించుకుంటానని సవాల్ చేశారు. చోడవరం లో టైల్స్ యజమానిని ధర్మ శ్రీ వేధిస్తుంటే ఆడ్డుకున్నానని తాను తప్పేమీ చేయలేదన్నారు.
సీఎం రమేష్ తన స్థాయిని నేరుగా జలగం, ఎర్రన్న వద్దకు తీసుకెళ్లి వారి స్థాయిలో పోరాడుతానని.. అండగా ఉంటానని భరోసా ఇచ్చేందుకు గట్టి ప్రయత్నమే చేస్తున్నారు.