సాక్షి పత్రిక మరోసారి తన పరువు పోగొట్టుకుంది. సీఎం రమేష్ మీసాలు మెలేసి… చేసిన సవాల్‌ను తీసుకోలేక.. నిరూపించలేక… ఏదేదో రాసుకొచ్చి పని పూర్తి చేసింది. సీఎం రమేష్ ఇంట్లో.. ఐటీ సోదాలు ప్రారంభం కాగానే… ఆయన సాక్షిలో పుంఖాను పుంఖాలుగా కథనాలు ప్రచురించడం.. ప్రసారం చేయడం ప్రారంభించారు. అందులో ఆయన నాలుగేళ్లలో వేల కోట్లకు పడగలెత్తారని.. చంద్రబాబు నామినేషన్ల పద్దతిన రూ. 2వేల కోట్ల పనులు ఇచ్చారని.. ఇలా… చాలా చాలా ఆరోపణలు చేశారు. తన ఇంట్లో ఐటీ సోదాలు ముగియగానే… సీఎం రమేష్ మీడియా ముందుకు వచ్చి… జగన్ మీడియా చేసిన ప్రతీ ఆరోపణకూ సమాధానం చెప్పారు.మీసం మెలేసి సవాల్ చేస్తున్నా.. ఒక్క రూపాయి పని అయినా నామినేషన్ పద్దతి ఇచ్చినట్లు నిరూపించాలని సాక్షి కి సీఎం రమేష్ సవాల్ చేశారు.
నాలుగేళ్లలో ఎన్ని వేల పనుల్ని రమేష్ చేజిక్కించుకున్నాడని ఓ పేద్ద జాబితా ప్రచురించింది, ఆ పనులన్నీ చేస్తున్నది తన రిత్విక్ కంపెనీయే, నిజమే అయితే తను సాక్షికి ఓ సవాల్ విసిరాడు మీసం మెలేసి అడుగుతున్నాను, నామినేషన్‌పై నేను తీసుకున్న ఒక్క పనిని చెప్పండి అని. ఒక్కసారిగా సాక్షి డిఫెన్స్‌లో పడిపోయింది. ఓ విచిత్రమైన వాదనతో పరువు పోగొట్టుకుంది. వితండవాదం చేసింది. సీఎం రమేష్ సవాల్‌కు కౌంటర్‌గా ఓ సుదీర్ఘ కథనాన్ని ప్రచురించారు. అందులో రమేష్ ఆరోపిస్తున్నట్టుగా ఒక్క పనిని కూడా చంద్రబాబు తనకు నామినేషన్‌పై ఇచ్చినట్టు నిరూపించేలా ఒక్క ఆధారమూ లేరు. కనీసం ఒక్క మాట కూడా లేదు.
నీరు చెట్టు కింద 15 వేల కోట్ల పనుల్ని నామినేషన్‌పై చంద్రబాబు ఇచ్చారంటూ.. సంబంధం లేని కొత్త ఆరోపణలు చేసి.. అతి తెలివి ప్రదర్శించింది. ఈ మొత్తం కథనంలో నామినేషన్‌పై రమేష్ తీసుకున్న పనుల వివరాలే లేవు. సీఎం రమేష్ అబద్ధాలతో రుబాబు చేశాడని రాసుకున్నారు కానీ.. అలాంటి.. రుబాబు ఏంటో చెప్పడలేకపోయిందంటే…. మీడియా అనే పేరుతో… ప్రత్యర్థి పార్టీ నేతలపై అబద్దాల ప్రచారం చేయాలనుకున్నది సాక్షినేనని తేలిపోతోంది. పోలవరం పనుల్ని నవయుగకు ఇవ్వలేదా అని కథనంలో రాశారు. దానికీ రమేష్‌కూ ఏం లింకు..? ఉన్నది లేనట్టు, లేనిది ఉన్నట్టుగా మాటల కనికట్టు ప్రదర్శిస్తున్నాడు రమేష్ అని ఆరోపించిన సాక్షి .. అదంతా తానే చేస్తున్నానని కథనం ద్వారా నిరూపించుకుంది. మొత్తానికి సాక్షి అనే పత్రిక ఐటీ దాడులను అడ్డం పెట్టుకుని తనకు ఇష్టం లేని రాజకీయ నేతలపై.. ఏక మొత్తంగా బురద జల్లాలనుకుంది. కానీ అడ్డంగా తనపైనే పోసుకుంది. ఇక సాక్షికి ఏ విలువలూ లేవని.. సర్టిఫికెట్ ఇచ్చేయవచ్చు.