నిరుద్యోగుల అంశంలో ప్రభుత్వంపై దుమ్మెత్తిపోస్తున్న బీఆర్ఎస్ కు సీఎం రేవంత్ రెడ్డి పాలమూరులో కౌంటర్ ఇచ్చారు. ఉద్యమంలో యువతను రెచ్చగొట్టి ఆత్మహత్యలకు కారణమయ్యారని, ఇప్పుడు నిరుద్యోగ యువతను ముందుపెట్టి రాజకీయం చేయాలనుకుంటున్నారని మండిపడ్డారు.
అమాయక, వెనుకబడ్డ వారిని ముందుపెట్టి… వారితో దీక్షలు చేయించి రాజకీయం చేయటం కాదు కేటీఆర్-హరీష్ రావులు ఓయూ ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్ష చేయాలన్నారు. పరీక్షలు వాయిదా అనేది కోచింగ్ సెంటర్ల మాఫియా కుట్రలు చేస్తుందని… పరీక్షలు వాయిదా పడితే ప్రభుత్వానికి నష్టం లేదు యువతకే నష్టం అని సీఎం స్పష్టం చేశారు.
మా ఎమ్మెల్యేలను తీసుకున్నప్పుడు, మా ప్రభుత్వాన్ని కూల్చివేస్తామన్నప్పుడు మీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలేదా… ఇప్పుడు మీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ లో చేర్చుకుంటే గుర్తుకొస్తుందా అని కేసీఆర్ పై ఫైర్ అయ్యారు.
పార్టీ బలహీన పడ్డప్పుడు కేసీఆర్ కు సెంటిమెంట్ గుర్తుకొస్తుందని… ఇప్పుడు నిరుద్యోగులతో సెంటిమెంట్ కోసం ప్రయత్నిస్తున్నారని, మీ ఆటలు ఇక సాగవు అని సీఎం స్పష్టం చేశారు.