సెక్రటేరియట్లో రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టడంపై కేటీఆర్ చేస్తున్న రాజకీయానికి రేవంత్ రెడ్డి ఊహించని కౌంటర్ ఇచ్చారు. మాటల దాడి మాత్రమే కాదు.. చేతల దాడి కూడా చేశారు. తెలంగాణ తల్లి విగ్రహాన్నిసెక్రటేరియట్లో పెట్టబోతున్నామని డిసెంబర్ 9వ తేదీన ఆవిష్కరించబోతున్నామని ప్రకటించారు. వెంటనే సెక్రటేరియట్లో ఎక్కడ తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలో కూడా స్థల పరిశీలన చేశారు.
కేసీఆర్ సెక్రటేరియట్ ను నిర్మించిన తర్వాత .. ప్రారంభోత్సవం చేశారు కానీ.. ఎవరి విగ్రహాన్ని కూడా పెట్టలేదు. ప్లాన్ ఉందో కూడా లేదో కూడా తెలియదు. అయితే తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాలనుకున్నారని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. అయితే అదే చోట రేవంత్ రెడ్డి.. రాజీవ్ గాంధీ విగ్రహానికి శంకుస్థాపన చేశారు. త్వరలో ఆవిష్కరణకు సిద్ధమవుతోంది. ఇలాంటి సమయంలో కేటీఆర్ తాము రాగానే రాజీవ్ గాంధీ విగ్రహాన్ని తీసేస్తామని ప్రకటనలు చేయడం ప్రారంభించారు.
Also Read : తాగుబోతు… దోపిడీదారుడు… కేసీఆర్ పై సీఎం రేవంత్ ఫైర్
అయితే తెలంగాణ తల్లి విగ్రహం లేకుండా రాజీవ్ గాంధీది మాత్రమే ఉంటే.. తప్పుడు సంకేతాలు వెళ్తాయన్న భావనకు రావడంతో వెంటనే రేవంత్ రెడ్డి వ్యూహం మార్చారు. పట్టుదలకు పోకుండా.. వెంటనే తెలంగాణ తల్లి విగ్రహా ఏర్పాటుకు సన్నాహాలు ప్రారంభించారు.