తెలంగాణ సచివాలయం ముందు పెట్టబోయే రాజీవ్ గాంధీ విగ్రహన్ని తొలగిస్తామని, తాము అధికారంలోకి రాగానే చర్యలు తీసుకుంటామని కేటీఆర్ ప్రకటించటంపై సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం అమరుడైన రాజీవ్ గాంధీ విగ్రహం పెడితే తప్పేంటి అని ప్రశ్నించారు.
కేటీఆర్ ఆ స్థలంలో వాళ్ల నాయన కేసీఆర్ విగ్రహాం పెట్టాలనుకున్నడు… ఆయన సచ్చేదెప్పుడు ఈయన పెట్టేదెప్పుడు అంటూ మండిపడ్డారు. అయినా, కేసీఆర్ లాంటి నాయకుడి విగ్రహం పెడితే సమాజంలో తాగుబోతులు తయారవుతారు తప్పా ఒరిగేదేం ఉండదన్నారు.
రాజీవ్ గాంధీ విగ్రహం మీద చెయ్యి వేస్తే చెప్పు తెగుద్ది… చెయ్యి ఎలా వేస్తావో నేనూ చూస్తా… వీపు చింతపండు అయితది అంటూ తనదైన శైలీలో రేవంత్ రెడ్డి కేటీఆర్ కు కౌంటర్ ఇచ్చారు.
తెలంగాణ తల్లి విగ్రహం పెట్టాలని ఇప్పుడు గుర్తుకు వచ్చిందా… 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఏం చేశారని సీఎం రేవంత్ ప్రశ్నించారు.
నేను మాటిస్తున్నా… వచ్చే డిసెంబర్ 9వ తేదీన సచివాలయం లోపల తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే బాధ్యత నాది అంటూ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు.