తెలంగాణ క్రీడాభిమానులకు సీఎం రేవంత్ రెడ్డి గుడ్ న్యూస్ చెప్పారు. హైదరాబాద్ శివారులో క్రికెట్ స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు తెలంగాణ అసెంబ్లీలో కీలక ప్రకటన చేశారు.
స్కిల్ యూనివర్సిటీ బిల్లుకు ఆమోదం అనంతరం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో సభ్యుల ప్రశ్నలకు సమాధానం ఇస్తూ మాట్లాడారు. ఈ సందర్భంగా శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి సమీపంలో కొత్తగా స్టేడియం నిర్మాణం చేపట్టనున్నట్లు చెప్పారు. దీనిని స్కిల్ యూనివర్సిటీ సమీపంలో నిర్మించనున్నట్లు వెల్లడించారు.
Also Read : టార్గెట్ రేవంత్.. బీఆర్ఎస్ కు అదొక్కటే మార్గమా..?
ఈ విషయంపై ఇప్పటికే బీసీసీఐతో ప్రాథమిక చర్చలు పూర్తి అయ్యాయన్నారు. స్టేడియం నిర్మాణం కోసం అవసరమైన భూమిని కేటాయించేందుకు తెలంగాణ సర్కార్ సిద్దంగా ఉందన్నారు రేవంత్ రెడ్డి. అయితే.. ఉప్పల్ స్టేడియంలో మ్యాచ్ ల నిర్వహణ వలన మ్యాచ్ లు జరిగే సమయంలో ట్రాఫిక్ రద్దీ తీవ్రంగా ఉంటుంది. దీంతో స్టేడియంను హైదరాబాద్ శివారులో ఎక్కడైనా ఏర్పాటు చేస్తే బాగుంటుంది అన్న అభిప్రాయాలు వినిపించాయి.
ఈ క్రమంలోనే అంతర్జాతీయ ఎయిర్ పోర్ట్ కు సమీపంలో క్రికెట్ స్టేడియం నిర్మిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవన్న ఆలోచనతోనే సర్కార్ ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలుస్తోంది.