తెలంగాణలో క్యాబినెట్ విస్తరణ ఉంటుందా… ఉండదా… అన్న చర్చ సాగుతూనే ఉంది. మీడియాలో వచ్చినట్లుగా విస్తరణ కోసమే వచ్చామన్నది అబద్ధమని, అధినాయకత్వం నిర్ణయం ప్రకారం మంత్రి పదవులతో పాటు పీసీసీ చీఫ్ ఎంపిక ఉంటుందని సీఎం రేవంత్ ప్రకటించారు.
జులై 7తో రేవంత్ రెడ్డి పీసీసీ టెన్యూర్ కంప్లీట్ అవుతుంది కాబట్టి కొత్త పీసీసీ చీఫ్ ఖాయమే. పార్టీలో ఉన్న సీనియర్లతో పాటు కొందరు సీనియర్ ఎమ్మెల్యేలు కూడా అయితే మంత్రి పదవి లేదా పీసీసీ చీఫ్ పోస్ట్ అయినా ఇవ్వాలంటూ కోరుతున్నారు.
దీంతో పీసీసీ చీఫ్ పోస్ట్ తో పాటు మంత్రి పదవులు కూడా ఎవరికో తేల్చేయబోతున్నారు. పీసీసీ చీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్లు, ప్రచార కమిటీ వంటి పోస్టులు కూడా కీలకమే. దీంతో ఢిల్లీలోనే సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం, పార్టీ ఇంచార్జ్, సీనియర్ నేతలు పార్టీ పెద్దలతో చర్చలు జరుపుతున్నారు.
అయితే, మంత్రి పదవుల విషయంలో సీఎం రేవంత్ రెడ్డికి పూర్తి స్వేచ్ఛ ఉండటంతో… ఆయన కీలక ప్రకటన చేశారు. తాము కేసీఆర్ లాగా ఇతర పార్టీలో గెలిచిన వారిని పార్టీలో చేర్చుకొని, మంత్రి పదవులు ఇవ్వమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీ భీఫాం మీద పోటీ చేసి, గెలిచిన వారికే మంత్రి పదవులుంటాయని కుండబద్ధలు కొట్టేశారు.
సో, ఆశావాహుల్లో కొందరికి మంత్రి పదవులతో పాటు పీసీసీ చీఫ్, రెండు వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులు, ప్రచార కమిటీ ఇచ్చి రేసులో ఉన్న వారందరికీ న్యాయం చేయబోతున్నారు.