తెలంగాణలో మరోసారి సీనియర్ ఐపీఎస్ ల బదిలీ జరగబోతుంది. ఒకట్రెండు రోజుల్లో దీనిపై అధికారిక ప్రకటన రాబోతుంది. ప్రస్తుతం ఉన్న డీజీపీ రవిగుప్తా స్థానంలో పూర్తిస్థాయి డీజీపీ రాబోతున్నారు.
ఎన్నికల సంఘం క్రమశిక్షణ చర్యల్లో భాగంగా అప్పుడున్న డీజీపీ అంజనీకుమార్ ను బదిలీ చేసి రవిగుప్తాను నియమించింది. ఆనాటి నుండి ఆయనే కొనసాగుతుండగా… ఇప్పుడు డీజీపీ జితేందర్ ను అపాయింట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఆయన హోంశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు.
ఇక ఎన్నికల సమయంలో బదిలీ అయిన సీనియర్ ఐపీఎస్ సుధీర్ బాబును మళ్లీ రాచకొండ కమిషనర్ గా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఇప్పుడున్న కమిషనర్ ను మల్టీజోన్ ఐజీగా ట్రాన్స్ఫర్ చేయనున్నట్లు తెలుస్తోంది.
వీరితో పాటు గ్రేటర్ పరిధిలోని మరో ఇద్దరు సీనియర్ అధికారులకు బదిలీ ఉంటుందని… సీఎం గ్రీన్ సిగ్నల్ ఇవ్వగానే జీవోలు విడుదల కాబోతున్నాయని పోలీస్ శాఖలో చర్చ జరుగుతోంది.