తెలంగాణ నుంచే అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలి : సీఎం రేవంత్ రెడ్డి

విద్యార్థుల ఉద్యమం వల్లే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు చర్యలు చేపడుతున్నామని.. ప్రభుత్వం ఏర్పడిన 90రోజుల్లో 30వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు అందజేసినట్లు వివరించారు. మరో 35వేల ఉద్యోగాలు త్వరలోనే భర్తీ చేయబోతున్నామన్నారు.

రాజీవ్ గాంధీ సివిల్స్ అభయహస్తం లబ్దిదారులకు ముఖ్యమంత్రి చెక్కులను పంపిణీ చేశారు. మెయిన్స్ కు అర్హత సాధించిన 135మందికి లక్ష చొప్పున ఆర్థిక సాయం అందించారు. సివిల్స్ ఉత్తీర్ణులై రాష్ట్ర ప్రతిష్టను పెంచాలని సూచించారు. రాష్ట్రం నుంచి అత్యధికంగా సివిల్ సర్వెంట్లు రావాలని అనుకుంటున్నాం. అందుకోసం ఈ ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు రేవంత్ రెడ్డి వివరించారు. మెయిన్స్ లో ఉత్తీర్ణులైతే మళ్లీ ఆర్థిక సాయం చేసేందుకు సిద్దంగా ఉన్నాం. ప్రజా ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత రైతులు, విద్యార్థులు అని స్పష్టం చేశారు. గత ప్రభుత్వ ప్రాధాన్యత ఏంటో పదేళ్లు కళ్ళారా చూశాం. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా తమ ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు.

గత ప్రభుత్వం వర్సిటీలను నిర్వీర్యం చేసిందని, ఈ వర్సిటీలకు పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు 10, 15 రోజుల్లో కొత్త వైస్ చాన్సలర్లను నియమిస్తామని చెప్పారు. వీటితోపాటు అన్ని ఖాళీలను భర్తీ చేస్తామన్నారు. కొంతమంది ఉద్దేశపూర్వకంగా నిరుద్యోగులను రెచ్చగొడుతున్నారని ఫైర్ అయ్యారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి రాజకీయ లబ్ది పొందాలని చూస్తున్నారు. ఉద్యోగ అర్హత పరీక్షలను వాయిదా వేస్తే నిరుద్యోగులకు నష్టమని..సహేతుకమైన కారణాలు చెబితే నిరుద్యోగులు చెప్పింది వినడానికి సిద్దంగా ఉన్నామని స్పష్టం చేశారు.

ప్రస్తుత విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా వర్సిటీ ద్వారా రెండు వేల మందికి శిక్షణ ఇవ్వబోతున్నామని రేవంత్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది నుంచి ఈ వర్సిటీలో 20వేల మందికి ప్రతి ఏటా శిక్షణ ఇస్తామన్నారు. వచ్చే విద్యా సంవత్సరంలో యంగ్ ఇండియా స్పోర్ట్స్ వర్సిటీ ఏర్పాటు చేస్తాం. 2028 ఒలంపిక్స్ లో తెలంగాణ అథ్లెట్లకు అత్యధికంగా పతకాలు వచ్చేలా కృషి చేస్తున్నాం. వంద నియోజకవర్గాల్లో 25 నుంచి 30 ఎకరాల్లో యంగ్ ఇండియా రెసిడెన్షియల్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామన్నారు రేవంత్ రెడ్డి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

రైతు భరోసాపై సర్కార్ కీలక ప్రకటన

రెండు లక్షల రుణమాఫీ పేరుతో హడావిడి చేసి రైతు భరోసాను కాంగ్రెస్ ప్రభుత్వం ఎగ్గొట్టిందని బీఆర్ఎస్ పదేపదే విమర్శలు చేస్తోంది. రైతు భరోసాను ఎప్పటి నుంచి అమలు చేస్తారు? ఎవరికి రైతు...

సత్య.. ది వన్ అండ్ ఓన్లీ…

సునీల్ తర్వాత మళ్ళీ ఆలాంటి కమెడియన్ దొరుకుతాడా? అనే ప్రశ్నకు సమాధానంగా కనిపించాడు సత్య. సునీల్ ని ఇమిటేట్ చేస్తున్నాడనే విమర్శలని బిగినింగ్ లో ఎదురుకున్నాడు. ఆ విమర్శలలో కొంతం వాస్తవం కూడా...
video

దేవర ముందర బావ బావమరిది

https://www.youtube.com/watch?v=7QCGkkKiJOE 96 సినిమాతో డైరెక్టర్ సి ప్రేమ్ కుమార్ పేరు బయటికి వచ్చింది. ఆ సినిమా మ్యాజికల్ హిట్. తెలుగులో రిమేక్ మాత్రం సరిగ్గా ఆడలేదు. ఇప్పుడు ప్రేమ్ కుమార్ నుంచి మరో సినిమా...

వేణుస్వామిపై కేసు – మూర్తి సక్సెస్

జాతకాల పేరుతో బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు గుంజే వేణు స్వామిపై కేసు పెట్టాలని హైదరాబాద్ పదిహేడో మెట్రోలిపాలిటక్ కోర్టు జూబ్లిహిల్స్ పోలీసులను ఆదేశించింది. వేణు స్వామి మహా మోసగాడు అని...

HOT NEWS

css.php
[X] Close
[X] Close