కేసీఆర్ కు గవర్నర్… కేటీఆర్ కు సెంట్రల్ మినిస్టర్… కవితకు బెయిల్ తో పాటు రాజ్యసభ… హరీష్ రావుకు అసెంబ్లీలో ప్రతిపక్ష నేత పదవి… బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అయితే పంచుకునే పదవులు ఇవే. ఈ మాటలు అన్నది ఎవరో మాములు వ్యక్తి కాదు స్వయంగా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్… బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ వస్తున్న వార్తలపై తనదైన శైలీలో స్పందించారు. విలీనం జరగటం ఖాయమని, బీఆర్ఎస్ కు ఉన్న నాలుగు రాజ్యసభ ఎంపీలున్న సంగతిని సీఎం రేవంత్ గుర్తు చేశారు.
కొంతకాలంగా బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అవుతుందని ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీలోని ఈ అంశంపై సీఎం రేవంత్ స్పందిస్తూ… చీకట్లో హరీష్ రావు-కేటీఆర్ ఢిల్లీలో బీజేపీ పెద్దలతో సమావేశం కాలేదా? అంటూ ప్రశ్నించారు. వరుసగా రెండుసార్లు హరీష్ రావు-కేటీఆర్ లు కలిసి ఢిల్లీ వెళ్లి రావటంతో ఈ ప్రచారం మరింత పెరిగింది.
తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఏకంగా పదవుల పంపకం కూడా జరిగిందంటూ బయటపెట్టడం చర్చనీయాంశంగా మారింది.