తెలంగాణ డీఎస్సీ 2024 ఫలితాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సచివాలయంలో విడుదల చేశారు.ఫలితాల విడుదలపై అభ్యర్థుల్లో ఆందోళన వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఫలితాలు విడుదలయ్యాయి. చాలా తక్కువ సమయంలో రిజల్ట్స్ విడుదల చేశామని..1 : 3 నిష్పత్తిలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఉంటుందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.
గత పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఒకే ఒక డీఎస్సీ నిర్వహించిందని.. కేవలం 7 వేల పోస్టులతో నోటిఫికేషన్ ఇచ్చిందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన మొదటి తొంభై రోజుల్లోనే 30వేల ఉద్యోగాలను భర్తీ చేశామన్నారు.డీఎస్సీ పరీక్షలు పూర్తి అయిన తర్వాత 55రోజుల్లోనే ఫలితాలను ఇచ్చామని.. ఇది యువత పట్ల కాంగ్రెస్ కు ఉన్న కమిట్మెంట్ కు నిదర్శమని పేర్కొన్నారు. డీఎస్సీకి ఎంపికైన వారికి దసరాలోపేఅక్టోబర్ 9న ఎల్బీ స్టేడియంలో నియామకపత్రాలు అందిస్తామని స్పష్టం చేశారు.
టీఎస్ పీఎస్సీని ప్రక్షాళన చేశాం..త్వరలోనే గ్రూప్ 1పరీక్షలు నిర్వహించి ఫలితాలు కూడా ఇస్తామని రేవంత్ రెడ్డి వివరించారు. తెలంగాణ డీఎస్సీ పరీక్షలకు మొత్తం 2,79,957 దరఖాస్తు చేసుకోగా.. 2,45,263 మంది పరీక్షకు హాజరయ్యారు. అత్యధికంగా సెకండరీ గ్రేడ్ టీచర్ (ఎస్జీటీ) పోస్టులకు 92.10 శాతం మంది అభ్యర్ధులు హాజరయ్యారు.