ఇద్దరి పోరాటం అదే… కేటీఆర్ ఇంగ్లీషను చూసో, కేటీఆర్ అడిగారనో తెలంగాణకు-హైదరాబాద్ కు పెట్టుబడులు రాలేదు. కాంగ్రెస్ కూడా పెట్టుబడులు తేగలదు అని చెప్పే ప్రయత్నంతో సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు.
మా కేటీఆర్ తోనే అవి సాధ్యం… కాంగ్రెస్ తెచ్చేవన్నీ ఫేక్, హైదరాబాద్ బ్రాండ్ అంతా కేటీఆర్ వల్లే అని చెప్పే ఉద్దేశం బీఆర్ఎస్ ది… కేటీఆర్ తరపున క్రిశాంక్ ది.
అవును… తెలంగాణలో ఇప్పుడు ఇదే ఫైట్ కనపడుతోంది. అమెరికా పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి అక్కడ వరుసగా వ్యాపారవేత్తలను, పలు కంపెనీల సీఈవోలను కలుస్తున్నారు. తోడుగా మంత్రి శ్రీధర్ బాబుతో పాటు ప్రభుత్వ యంత్రాంగం అంతా ఉంది. బిజీ షెడ్యూల్ తో పాటు ఆ కంపెనీ ఇన్ని వేల కోట్లు, ఈ కంపెనీ ఇన్ని వందల కోట్లు పెట్టుబడి పెడుతుంది అని సీఎంవో ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తోంది.
అలా సీఎంవో నుండి ఏ కంపెనీ పెట్టుబడికి ముందుకు వచ్చిందో చెప్పటమే ఆలస్యం క్రిశాంక్ ఎంటరైపోతున్నారు. ఆ కంపెనీ ఫేక్, ఈ కంపెనీకి అన్ని కోట్లు పెట్టే సామర్థ్యం లేదు అంటూ ట్వీట్స్ తో హడావిడి చేస్తున్నారు.
కేటీఆర్ తరపున క్రిశాంక్ వకాల్తా పుచ్చుకున్నారు సరే… కానీ క్రిశాంక్ ను కౌంటర్ చేసేందుకు కాంగ్రెస్ లో ఎవరూ ముందుకు రాకపోవటమే కొసమెరుపు. అధికారం ఉన్నా, పలువురు యువ నాయకులకు చైర్మన్ గిరి ఇచ్చినా, సర్కార్ ను డిఫెండ్ చేసుకునేందుకు ముందుకు రావట్లేదన్న అభిప్రాయం వినిపిస్తోంది.