రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి చూసుకుందాం – రేవంత్ వార్నింగ్

ప్రపంచంతో భారత్ పోటీ పడుతుందంటే కారణం మజీ ప్రధానమంత్రి రాజీవ్ గాంధీ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసింది ఆయనేనని చెప్పుకొచ్చారు. రాజీవ్‌గాంధీ విగ్రహాన్ని సచివాలయం ఎదుట ఆవిష్కరించిన అనంతరం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ ఫ్యామిలీపై మరోసారి ఫైర్ అయ్యారు.

సచివాలయం ఎదుట రాజీవ్ గాంధీ విగ్రహాం ఎలా పెడుతారని కేటీఆర్ ప్రశ్నిస్తున్నారని వ్యాఖ్యానించిన రేవంత్…ఆయన వల్లే కేటీఆర్ ఐటీ చదివి అమెరికా వెళ్లారన్నారు. రాజీవ్ గాంధీ కంప్యూటర్ పరిచయం చేయకపోతే కేటీఆర్ ఎక్కడ ఉండేవాడు అని ప్రశ్నించారు. గాంధీ కుటుంబం గురించి కేసీఆర్ ఫ్యామిలీకి ఏం తెలుసు..? అడ్డగోలుగా మాట్లాడితే చూస్తూ ఊరుకుంటామని అనుకున్నారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెహ్రూ అధికారంలో ఉనప్పుడు ఇందిరా గాంధీ ఏ బాధ్యత తీసుకోలేదు. కొందరు మాత్రం తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకొని మంత్రి పదవులు పొందారని.. కేటీఆర్ కు చురకలు అంటించారు.

అధికారం పోయినా కేటీఆర్ కు మదం దిగలేదని రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన రాజీవ్ గాంధీ విగ్రహాన్ని సచివాలయంలో పెడితే ఎందుకు పెడుతారని ప్రశ్నిస్తారా? అని కేటీఆర్ పై మండిపడ్డారు. త్యాగం అంటే ఏమిటో గాంధీ ఫ్యామిలీని చూసి నేర్చుకోవాలని హితవు పలికారు.

సచివాలయం ముందు తెలంగాణ తల్లి విగ్రహం పెడదామని అనుకున్నారట..10ఏళ్లుగా తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని కేటీఆర్ ను రేవంత్ ప్రశ్నించారు. ఫామ్ హౌజ్ లు కట్టుకున్నావు.. లక్ష కోట్లు దింగమింగి కాళేశ్వరం కట్టుకున్నావు..తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదని కేసీఆర్ ను నిలదీశారు. సచివాలయంలో కేసీఆర్ విగ్రహం పెట్టుకోడానికి స్థలం ఉంచుకున్నారని ఆరోపించారు. రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎవరు తొలగిస్తారో రండి.. చూసుకుందామని రేవంత్ మరోసారి వార్నింగ్ ఇచ్చారు.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు – జగన్ హయాంలో అపచారం!

తిరుమలలో ఎన్ని అరాచకాలు చేయాలో అన్నీ చేశారని తేలిపోయింది. చివరికి తిరుపతి లడ్డూ ప్రసాదాన్ని కూడా అపవిత్రం చేశారు. వైసీపీ హయాంలో తిరుపతి లడ్డూ క్వాలిటీ అత్యంత ఘోరంగా ఉండేది. దానికి కారణం...

తమిళనాడు డిప్యూటీ సీఎంగా ఉదయనిధి

తమిళ రాజకీయాలు మారిపోతున్నాయి. ఓ వైపు పొలిటికల్ వాక్యూమ్ ను ఉపయోగించుకుని రాజకీయ నాయకుడు అయిపోవడానికి విజయ్ కొత్త పార్టీ పెట్టారు. మరో వైపు అన్నాడీఎంకే కూడా బలమైన క్యాడర్ తో ఉంది....

వైసీపీ ఆఫీసులకూ అదే పరిస్థితి – లా ఒక్కటే !

నల్లగొండ బీఆర్ఎస్ ఆఫీసును కూల్చేయాలని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలతో .. వైసీపీకి కూడా గుండెల్లో రాయి పడింది. బీఆర్ఎస్ పార్టీకి అదొక్కదానికే అనుమతుల్లేవేమో కానీ వైసీపీకి చెందిన ఒక్క ఆఫీసుకు తప్ప...

దేవరని రామాయణంతో ముడిపెట్టిన పరుచూరి

రచయిత పరుచూరి గోపాలకృష్ణ 'పరుచూరి పలుకులు' పేరుతో సినిమాల‌ను విశ్లేషిస్తుంటారు. ఆయన విశ్లేషణలు చాలా ప్రజాదరణ పొందాయి. తన అనుభవాలన్నీ జోడిస్తూ సినిమాల్లోని లోటుపాట్లని, మంచి విషయాల్ని చెపుతుంటారు. తాజాగా ఎన్టీఆర్ దేవర...

HOT NEWS

css.php
[X] Close
[X] Close