ఆంధ్రప్రదేశ్లో వాస్తవ ఆర్ధిక పరిస్ధితిపై సిఎం జగన్ దృష్టిసారించారు. దుబారా ఖర్చలు తగ్గించుకుంటూనే ప్రజలపై భారం పడకుండా ఆర్ధిక వనరులను పెంచుకునే మార్గాలను అన్వేషించాలని ఆర్ధిక శాఖ, రెవెన్యూశాఖ అధికారులతో జరిగిన తోలి సమీక్షా సమావేశంలో ఆదేశాలు ఇచ్చారు. అయితే… అధికారుల దృష్టిలో.. ప్రత్యామ్నాయ.. ఆదాయ వనరులేమిటన్నదానిపై.. ఆసక్తి ఏర్పడింది. కొత్త పన్నులు తప్ప.. మరో మార్గం లేదని.. వారు చెప్పినట్లుగా ప్రచారం జరుగుతోంది.
ఆదాయం పెరిగే సృజనాత్మక మార్గాలు అధికారులు చెప్పాలన్న సీఎం ..!
రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై తొలి సారి జరిపిన సమీక్షలో… జగన్కు పూర్తిగా వివరాలు తెలియలేదు. దాంతో.. సంపూర్ణమైన నివేదికలతో ఈ సారి సమీక్షకు రావాలని ఆదేశించారు. అధికారులు రాష్ట్ర ఆర్ధిక స్ధితిగతులుపై ముఖ్యమంత్రికి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు. ప్రస్తుతం చెల్లించాల్సిన బిల్లులు, వచ్చే ఆదాయం, చేయాల్సిన వ్యయం వంటి అంశాలపై వారు సిఎంకు వివరించారు. ఆర్ధిక పరిస్ధితి కుదుటపడేందుకు దుబారా తగ్గించాలన్న సిఎం ఆర్ధిక వనరులను పెంచుకోవాడానికి ఉన్న సృజనాత్మక మార్గాలతో వచ్చే సమావేశానికి హజరుకావాలని అదికారులకు సిఎం సూచించారు. క్రమశిక్షణలో భాగంగా తమ ప్రభుత్వం తీసుకునే చర్యల వల్ల సామాన్యులపై భారం పడకుండా ఆదాయాన్ని పెంచుకునే మార్గాలను అన్వేషించాలని అధికారులకు ఆయన సూచించారు..
మద్యం నియంత్రణ పేరుతో ఆదాయం పెంచుకోవడమే మొదటి పాయింట్..!
మద్యనియంత్రణ లో భాగంగా… మొదటగా.. మద్యం రేట్లు సామాన్యులకు అందుబాటులో లేకుండా భారీగా పెంచుతామని… జగన్మోహన్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. అది ఇప్పుడు అమలు చేసే అవకాశం కనిపిస్తోంది. మద్యం లైసెన్స్ ఫీజులు, మద్యం రేట్లు భారీగా పెంచాలనే ఆలోచన చేస్తున్నారు. అయితే ఇది ధరల పెంపులా కాకుండా.. మద్యం తాగే వాళ్లని నియంత్రించడానికన్నట్లుగా చెప్పబోతున్నట్లు ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. దీని వల్ల ప్రభుత్వ ఆదాయం పెరగడంతో పాటు… దశలవారీ మద్యనిషేధంలో మొదటి అడుగు వేసినట్లవుతుందని.. చెప్పుకోవచ్చన్నది అసలు పాయింట్. అధికారులు కూడా.. ఇదే ఆలోచనల్లో ఉన్నట్లుగా తెలుస్తోంది.
ఇసుక ఇక ఉచితం కాదనే విధానం..!
ఆదాయ మార్గాలు పెంచుకునే దిశగా… అధికారులు జగన్ ముందు అనేక పన్ను ప్రతిపాదనలు పెట్టారు. అందులో మొదటిది.. ఇసుక విధానం. ఇసుక గత ప్రభుత్వం ఉచితంగా ఇచ్చింది. రవాణా చార్జీలు కట్టి.. తీసుకెళ్లాలా విధానం పెట్టింది. అయితే.. జగన్మోహన్ రెడ్డి దీనిపై గతంలో ఆరోపణలు చేశారు. ఇప్పుడీ ఇసుక విధానం మారిస్తే.. ఏడాదికి రూ. రెండు వేల కోట్లు వస్తాయన్న ప్రతిపాదనను అధికారులు జగన్ ముందు ఉంచారు. అలాగే హరితపన్ను, వ్యర్ధపదార్దాలపై పన్ను, ఎర్రచందనం అమ్మకం ద్వారా ఆదాయం వస్తుందని జగన్ కు చెప్పారు. తక్కువవడ్డీకి బుణాలు తేవడం కూడా ఇందులో ఒకటి. అధికారులు చెప్పిన వాటిలో ప్రధానగా ఉన్నవి… పన్నుల విధింపే. ఆదాయా మార్గానికి ప్రజలను బాదడమే మార్గాలుగా… అధికారులు జగన్కు చెబుతున్నారు. మరి కొత్త సీఎం ఏం చేస్తారో..?