ప్రభుత్వ రంగ సీఎన్సీ గ్రామీణ ప్రాంతాల్లో సినిమా థియేటర్లను నెలకొల్పేందుకు సన్నాహాలు చేస్తోంది. రాబోయే రెండేళ్లలో 10వేల కొత్త థియేటర్లను గ్రామీణ ప్రాంతాల్లో నెలకొల్పడమే లక్ష్యంగా పని చేస్తుంది. ఇందుకోసం గత నెలలో అక్టోబర్ సినిమాస్ తో సీఎన్సీ ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ చేతులు కలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో 100 నుంచి 200 సీటింగ్ కెపాసిటీ ఉన్న లక్ష థియేటర్లను తెరవాలని ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్న సీఎన్సీ మేనేజింగ్ డైరెక్టర్ సంజయ్ కుమార్ రాకేష్ తెలిపారు.
2024 చివరి నాటికి ఏకంగా 10వేల సినిమా థియేటర్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఈ సినిమా హాళ్లు నడపాలంటే పెట్టుబడి సుమారు 15 లక్షల వరకు అవసరం అవుతుందన్నారు. గ్రామీణ ప్రాంతంలోని వ్యాపారులకు ఈ సినిమా హాళ్లు కొత్త అవకాశాలను కల్పిస్తాయని, ప్రత్యక్షంగా.. పరోక్షంగా ఎంతోమంది ఉపాధి లభిస్తుందని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2023 ఆఖరకు కనీసం 1500 సినిమా హాళ్ళని ప్రారంభించాలని సిఎస్సి భావోస్తోంది.