హైద‌రాబాద్ లో కాగ్నిజెంట్ రెండో అతిపెద్ద క్యాంప‌స్

ప్ర‌ముఖ సాఫ్ట్ వేర్ సంస్థ కాగ్నిజెంట్ అమెరికా త‌ర్వాత అతిపెద్ద క్యాంప‌స్ ను హైద‌రాబాద్ లో ఏర్పాటు చేయ‌బోతుంది. భారీ విస్త‌ర‌ణ ప్ర‌ణాళిక‌తో ఉన్న కాగ్నిజెంట్ హైద‌రాబాద్ లో మ‌రో 15వేల మందికి నేరుగా ఉద్యోగాలిచ్చేంత పెద్దగా విస్త‌రించ‌బోతుంది.

దాదాపు 10ల‌క్ష‌ల చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంతో రాబోతున్న ఈ కొత్త క్యాంపెస్ గురించి అమెరికాలో ప‌ర్య‌టిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి, ఐటీ మంత్రి శ్రీ‌ధ‌ర్ బాబుతో కంపెనీ ప్ర‌తినిధులు భేటీ అయ్యారు. కొత్త సెంట‌ర్ కు సంబంధించిన ఒప్పందం కూడా చేసుకున్నారు.

ఈ సెంట‌ర్ ఏర్పాటుకు సంబంధించి గతంలో దావోస్ లో సీఎం రేవంత్ రెడ్డితో కంపెనీ ప్ర‌తినిధులు భేటీ అయిన‌ప్పుడే ప్రాథ‌మికంగా నిర్ణ‌యం జ‌రిగింది. ఇప్పుడు పూర్తిస్థాయిలో ఒప్పందం కూడా జ‌రిగింది.

ఐటీ సేవ‌ల‌తో పాటు ఆర్టిఫిషియ‌ల్ ఇంట‌లిజెన్స్, మెషిన్ లెర్నింగ్, క్లౌడ్ సొల్యూష‌న్స్ వంటి ఆధునాత‌న సాంకేతిక‌త‌ల‌పై కొత్త క్యాంప‌స్ నుండి దృష్టిసారించ‌బోతున్న‌ట్లు కంపెనీ ప్ర‌క‌టించింది.

త‌మ సేవ‌ల‌కు కేవ‌లం హైద‌రాబాద్ కే ప‌రిమితం చేయ‌కుండా… తెలంగాణ‌లోని ద్వితీయ శ్రేణి న‌గ‌రాల‌కు విస్త‌రించే ప్రణాళిక చేయాల‌ని, మీకు అవ‌స‌రం అయిన అన్ని స‌దుపాయాల‌ను ప్ర‌భుత్వం క‌ల్పించేందుకు రెడీగా ఉంద‌ని సీఎం కంపెనీ ప్ర‌తినిధుల‌కు వివ‌రించారు. భ‌విష్య‌త్ లో త‌మ ఆలోచ‌న‌లు అటు వైపు ఉంచాల‌ని కోర‌గా…అందుకు కంపెనీ సానుకూలంగా స్పందించిన‌ట్లు సీఎంవో వ‌ర్గాలు తెలిపాయి.

Telugu360 is always open for the best and bright journalists. If you are interested in full-time or freelance, email us at Krishna@telugu360.com.

Most Popular

శ్రీవారి లడ్డూ ఇష్యూ : వైసీపీ పాపం పండింది !

గుడిని గుడిలో లింగాన్ని మింగే బ్యాచ్‌కు ప్రజలు తిరుగులేని మెజార్టీతో అధికారం ఇస్తే.. తమకు దోచుకోమని లైసెన్స్ ఇచ్చారని ఫీలవుతారు. వైసీపీ నేతలు అదే ఫీలయ్యారు. దేవుడనే భయం కూడా...

కంగనపై దానం కామెంట్స్‌ – కేటీఆర్ ఖండన !

సినిమాల్లో బోగం వేషాలు వేసుకునే కంగనా.. రాహల్ గాంధీని విమర్శించడమా ?... అని దానం నాగేందర్.. హీరోయిన్ కంగనపై విరుచుకుపడ్డారు. ఈ బోగం వేషాలు అంటే ఏమిటో కానీ.. బీజేపీ నేతలకు...

తిరుపతి లడ్డూ ఇష్యూ : అడ్డంగా దొరికినా అదే ఎదురుదాడి !

వైసీపీ సిగ్గులేని రాజకీయాలు చేస్తుంది. అడ్డంగా దొరికిన తర్వాత కూడా ఎదురుదాడి చేసేందుకు ఏ మాత్రం సిగ్గుపడటం లేదు. తిరుమల శ్రీవారి ప్రసాదం లడ్డూలో నాణ్యత లేని నెయ్యిని.. పశువుల కొవ్వుతో కల్తీ...

తిరుప‌తి ల‌డ్డు చుట్టూ వివాదం… ఇంత‌కు ఈ ల‌డ్డూ ఎందుకింత స్పెష‌ల్?

తిరుప‌తి ల‌డ్డూ. తిరుమ‌ల‌లో శ్రీ‌వారి వెంక‌న్న ద‌ర్శ‌నాన్ని ఎంత మ‌హాభాగ్యంగా భావిస్తారో... తిరుప‌తి ల‌డ్డూను అంతే మ‌హాభాగ్యంగా భావిస్తారు. ఉత్త‌రాది, ద‌క్షిణాది అన్న తేడా ఉండ‌దు... ఆ రాష్ట్రం, ఈ రాష్ట్రం అన్న...

HOT NEWS

css.php
[X] Close
[X] Close