వరంగల్ అర్బన్ కలెక్టర్ కాట అమ్రపాలి పెళ్లి జమ్మూ కాశ్మీర్ హిందూ సంప్రదాయాల జరిగింది. పెళ్లి దుస్తుల్లో అమ్రపాలి వెలిగిపోయింది. నచ్చిన వాడిని చేసుకున్న ఆనందం ఆమె కళ్లలో ప్రతిఫలించింది. గత కొన్ని సంవత్సరాలుగా ఐపీఎస్ ఆఫీసర్ సమీర్ శర్మతో అమ్రపాలి ప్రేమలో ఉన్నారన్న విషయం ఆలస్యంగా బయటి ప్రపంచానికి తెలిసింది. పెళ్లికి నెల రోజుల ముందు మాత్రమే ఈ వీరి లవ్ స్టోరీ గురించిన సమాచారం మీడియాకు తెలిసింది. అమ్రపాలికి సంబంధించిన ప్రతి చిన్న విషయాన్ని సోషల్ మీడియాలో యువతీ యువకులు కీన్గా ఫాలో అవుతున్నారు. అలాంటిది అమ్రపాలి లవ్ స్టోరీ అనగానే మరింతగా ఆసక్తిగా ఆమెకు సంబంధించిన సమాచారం తెలుసకోవడానికి తాపత్రయపడ్డారు. ఇక్కడ తెలంగాణాలో ఉండే అమ్రపాలి.. ఎక్కడో గుజరాత్ ఆనుకుని ఉన్న డామన్ అండ్ డయూ అనే కేంద్ర పాలిత ప్రాంతంలో పని చేస్తోన్న సమీర్ శర్మను ఎలా లవ్ చేశారా? అని ఆశ్చర్యపోని వారు లేరంటే అతియోశక్తి కాదు. అమ్రపాలి కంటే సమీర్ చిన్న వాడు కావడం మరో విశేషం. ఒక ప్రభుత్వ కార్యక్రమాల్లో వీరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఆదివారం అంటే ఫిబ్రవరి 18న జమ్మూ హిందూ సంప్రదాయం ప్రకారం పెళ్లిగా మారింది. పెళ్లి సందర్భంగా అమ్రపాలి తన సోదరితో కలిసి దిగిన ఫోటో వైరల్‌గా మారింది. అమ్రపాలి.. తన భర్తతో కలిసి ఫిబ్రవరి 22 హనుమకొండకు రానున్నారు. ఆ మరుసటి రోజు రిసెప్షన్ ఇవ్వనున్నారు. ఆ తరువాత అంటే ఫిబ్రవరి 25న హైదరాబాద్‌లో కూడా తన బంధుమిత్రులకు పార్టీ ఇవ్వనున్నారు. ఆ తరువాత హానీమూన్‌కు టర్కీ వెళ్లనున్నారు. మార్చి 8న అమ్రపాలి విధులకు హాజరు కావాలని ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం. అమ్రపాలి 2010 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అధికారి. ఆమెకు సివిల్స్‌లో 39వ ర్యాంకు వచ్చింది. సమీర్ శర్మ.. 2011 ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన వారు. అమ్రపాలి తండ్రి కాట వెంకటరెడ్డి స్వస్థలం ఒంగోలు. విశాఖ ఆంధ్ర యూనివర్సిటీలో చదివిన ఆయన అక్కడే ప్రొఫెసర్‌గా పని చేసి రిటైరయ్యారు. ఈ కారణంగా అమ్రపాలి బాల్యం, చదువు అంతా వైజాగ్‌లో సాగాయి. మద్రాస్ ఐఐటీ నుంచి బీటెక్ చదివిన అమ్రపాలి.. బెంగళూరు ఐఐఎంలో.. బిజినెస్ మేనేజ్మెంట్లో పీజీ డిప్లమా అందుకున్నారు. మొదట వికారాబాద్ సబ్ కలెక్టర్‌గానూ, ఆ తరువాత శిశు సంక్షేమ శాఖలోనూ అమ్రపాలి పని చేశారు. 2016 అక్టోబరు 11న వరంగల్ కలెక్టర్‌గా నియమితులయ్యారు.