ఏ సంస్థ అయినా తమ ఉత్పత్తుల్ని మార్కెటింగ్ చేసుకోవాలంటే … ఆ ఉత్పత్తుల గొప్పతనాన్ని ఉపయోగిస్తూ.. ఓ వ్యాపార ప్రకటన రిలీజ్ చేస్తుంది.ప్లస్ పాయింట్లన్నిటినీ తెలిసేలా చేస్తుంది. ఇదే టెక్నిక్ ను.. ఇప్పుడు… కొత్తగా తనను తాను మార్కెట్ చేసుకునేందుకు ఉపయోగించుకున్నారు కలర్స్ స్వాతి. చిన్న తనంలోనే ఫేమ్ వచ్చినా.. మంచి సినిమాలనే వాటిలో నటించినా.. ఆమెకు హీరోయిన్ హోదా పూర్తి స్థాయిలో రాలేదు. చూసీ చూసీ చివరికి ఓ పైలట్ ను పెళ్లి చేసుకున్నారు. ఇండోనేషియాలో కాపురం పెట్టారు. ఆమె ఇక సినిమాల్లో కనిపించరు కాబోలని.. పెళ్లి ఫోటోలు చూసిన వాళ్లు అనుకున్నారు.కానీ హఠాత్తుగా ఓ ప్రముఖ చానల్ యాంకర్ ను ఇండోనేషియా పిలిపించుకుని ఓ ఇంటర్యూ ఇచ్చి తాను సినిమాలకు రెడీ.. తన హజ్బెండ్ పర్మిషన్ ఇచ్చారని.. తనకు అలవాటైన పద్దతిలోనే చెప్పింది. కాకపోతే ఈ ప్రోగ్రామే…సూపర్ మార్కెటింగ్ టెక్నిక్ ఉపయోగించి సిద్ధం చేశారు.
మామూలుగా పెళ్లి కానప్పుడే కలర్స్ స్వాతికి చాన్సుల్లేవు. మరి పెళ్లయిన తర్వాత ఎవరిస్తారు..? ఎదో ఒకటి అడ్వాంటేజ్ యాడ్ కావాలి కదా..! అందుకే.. తను ఎంతో బోల్డ్ అన్నట్లుగా… ఆ ప్రోగ్రాంలో 70 శాతం స్విమ్ సూట్ లోనే అదీ కూడా… మొత్తం బాడీ ఫిగర్ ఎక్స్ పోజ్ అయ్యేలా.. ఉండే స్విమ్ సూట్ తో కనిపించారు. సినిమాల్లో స్వాతి వీలైనంత వరకూ పద్దతిగానే కనిపించారు. ఎక్కడా ఎక్స్ పోజింగ్ చేసిందేన టాపిక్ రాలేదు. ఆమె చేయలేదో.. ఆమె చేస్తే ఎవరు చూస్తారని.. డైరక్టర్లు అడగలేదో .. చిన్న తనం నుంచి ఆమెను స్క్రీన్ మీద చూస్తున్న ప్రేక్షకులు డైజెస్ట్ చేసుకోలేనో కానీ.. మొత్తానికి ఆమె ఓ తెలుగు హీరోయిన్ గానే ఉండిపోయింది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితిని అడ్వాంటేజ్ గా చేసుకుని చాన్సుల కోసం తనను తాను మార్కెట్ చేసుకోవాలని డిసైడ్ అయినట్లుంది.
ఇప్పుడు పెళ్లపోయిందని… తాను పద్దతిగా ఉంటానని అనుకోవద్దని స్కిన్ షోతో సిల్వర్ స్క్రీన్ పై వేడి పుట్టించలననని నిరూపించేందుకు ప్రత్యేకంగా ఈ షోను డిజైన్ చేయించుకున్నారు. మాటలే కాదు.. చేతలు కూడా అలాగే ఉంటాయని… స్విమ్ సూట్ తో షూట్ చేయించుకుని చెలరేగిపోయారు. తన లైఫ్ స్టైల్ ఇలా ఉందని చెప్పుకున్నారు.. అంతిమంగా సినిమా చాన్సుల కోసమేనని.. నటించడానికి రెడీనేనని.. అదీ కూడా.. ఎలాంటి పాత్రలకైనా రెడీ అయినా.. ఈ షో ద్వారా తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ పరిశ్రమలకూ సంకేతం పంపించారు.