కలర్స్ స్వాతి పెళ్లి కుదిరింది. ఈనెల 30న స్వాతి పెళ్లి చేసుకోబోతోంది. ఇది ప్రేమ వివాహమే. వికాస్ అనే యువకుడితో కొంతకాలంగా స్వాతి ప్రేమలో ఉంది. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు ఇద్దరూ ఒకటి కాబోతున్నారు. వికాస్ ఓ పైలెట్. మలేసియన్ ఎయిర్‌లైన్స్‌లో బాధ్యతలు నిర్వహిస్తున్నాడు. ఆగస్టు 30న హైదరాబాద్‌లో వీళ్లిద్దరికీ పెళ్లి జరగబోతోంది. సెప్టెంబరు 2న కొచ్చిలో రిసెప్షన్ ఇవ్వబోతున్నారు. పెళ్లయ్యాక స్వాతి సినిమాలకు దూరంగా ఉండబోతోందని సమాచారం. వివాహం తర్వాత స్వాతి తన భర్తతో కలిసి ఇండోనేసియాలో స్థిరపడుతుందని తెలుస్తోంది.
‘కలర్స్’ అనే టీవీ షో ద్వారా స్వాతి బుల్లితెరకు పరిచయమయ్యారు. ‘డేంజర్’ చిత్రంతో వెండితెరపై అడుగుపెట్టింది. ‘అష్టాచెమ్మా’, ‘స్వామిరారా’, ‘కార్తికేయ’ లాంటి విజయాలు ఆమె ఖాతాలో ఉన్నాయి. తమిళంలోనూ కథానాయికగా పేరు తెచ్చుకుంది స్వాతి.