ఇటీవల తన ట్విట్టర్ లో పవన్ ని పొగుడుతూ ఓ ట్వీట్ చేశాడు అలీ. అది బాగా వైరల్ అయ్యింది. పవన్ ని పొగిడినా – ఫ్యాన్స్ నెగిటీవ్ గా తీసుకున్నారు. `మా పవన్ ఇప్పుడు గుర్తొచ్చాడా` అంటూ అలీపై సెటైర్లు వేశారు. నిజానికి అలీకి ట్విట్టర్ ఎకౌంటే లేదు. అది ఫేక్ ఎకౌంట్. ఆ ఎకౌంట్ తో అలీకి ఎలాంటి సంబంధం లేదు. దాంతో అలీ ఇప్పుడు సైబర్ పోలీసులను ఆశ్రయించారు. తన పేరుతో ఉన్న ట్విట్టర్ ఖాతాని తొలగించాలని, తన పేరుతో ట్వీట్లు చేస్తున్న వ్యక్తిపైచర్యలు తీసుకోవాలని ఆయన పోలీసుల్ని కోరారు. పోలీసులు కూడా సానుకూలంగా స్పందించారు. ఈ కేసు త్వరిత గతిన దర్యాప్తు చేస్తామని అలీకి హామీ ఇచ్చారు.
అలీపేరుతో బయటకు వచ్చిన ట్వీట్లు టాలీవుడ్ లో బాగానే హల్ చల్ చేశాయి. టీవీ 9లో సైతం ఓ స్పెషల్ ఎపిసోడ్‌ని రన్ చేశారు. నిజానికి అసలు తెర వెనుక ఇంత హంగామా జరుగుతుందన్న విషయం అలీకి తెలియదట. ఫేక్ ఎకౌంట్లతో తలనొప్పి ఎక్కువైందని, అందుకే త్వరలోనే తాను ట్విట్టర్లోకి వస్తానని అలీ చెబుతున్నారు.