కమెడియన్ ఆలీ 2019 ఎన్నికలకు ముందు వైఎస్సార్ సీపీ పార్టీ లోకి చేరిన విషయం తెలిసిందే. అయితే అలా పార్టీలోకి చేరినప్పటికీ ఆయన కు వైఎస్ఆర్ సీపీ లో ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ లభించలేదు. మరి ఆలీ ఏ కారణంతో వైఎస్ఆర్ సీపీలోకి చేరాడో అన్న ప్రశ్న అప్పట్లో ఉదయించింది. రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న రూమర్లను బట్టి చూస్తే త్వరలోనే ఆలీకి ఎమ్మెల్సీ పదవి రానుందని, ఆ పదవి ఈ ప్రశ్నలన్నింటికి సమాధానాన్ని ఇవ్వనుందనే చర్చ వినిపిస్తోంది.
ఎమ్మెల్యే టికెట్ ఎంపీ టికెట్ ఏమీ ఇవ్వకుండా వైఎస్సార్సీపీ లో చేరిన ఆలీ:
ముఖ్య మంత్రి గా చంద్ర బాబు నాయుడు ఉన్నప్పుడు, ఆలీ ని సన్మానించటానికి ఒక ఫంక్షన్ జరిగితే ముఖ్య మంత్రి గా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ చంద్ర బాబు నాయుడు ఆ సన్మానానికి హాజరయ్యారు, ఆలీ గురించి గొప్పగా మాట్లాడాడు కూడా. పలు మార్లు ఆలీ చంద్రబాబు నాయుడు తో ఏకాంతంగా కూడా సమావేశం అయ్యారు. అదే విధంగా జన సేన అధి నేత పవన్ కళ్యాణ్ ఆలీ కి మొదటి నుంచి స్నేహితుడిగా ఉండేవారు. సినిమా ఫంక్షన్ల లో ఆలీ గురించి పవన్ కళ్యాణ్ గొప్ప గా చాలాసార్లు మాట్లాడారు కూడా. చంద్ర బాబు నాయుడు , పవన్ కళ్యాణ్ ల తో పోలిస్తే ఆలీ కి గతంలో జగన్ తో సాన్నిహిత్యం ఉన్నట్లు గా పెద్దగా కనిపించదు. పైగా, కమెడియన్ పృథ్వి, పోసాని కృష్ణ మురళి, కోన వెంకట్ లాంటి వారి లాగా ఆలీ కి వైఎస్సార్ సీపీ పార్టీ తో మొదటి నుండి అనుబంధం ఉన్నట్లు గా కూడా ఎప్పుడు కనిపించ లేదు. అయినప్పటికీ, చంద్ర బాబు, పవన్ కళ్యాణ్, వైయస్ జగన్ ఇలా ముగ్గురితో ఏకాంతంగా భేటీ అయిన ఆలి చివరికి వైసీపీలో చేరడానికి నిర్ణయించుకున్నారు. ఎమ్మెల్యే టికెట్ కానీ ఎంపీ టికెట్ కానీ ఇవ్వకుండానే ఆయన వైకాపా లో చేరిపోవడం అప్పట్లో చాలా చర్చకు దారి తీసింది.
పార్టీలో చేరే ముందు వైఎస్ఆర్ సీపీ కి భారీ ఫండ్ ఇచ్చాడంటూ రూమర్లు:
ఒక టీవీ చానల్ ఇంటర్వ్యూ లో ఏ పార్టీ తనకు మంత్రి పదవి ఇస్తానంటే ఆ పార్టీలో చేరతానని అప్పట్లో ప్రకటించిన ఆలీ, వై ఎస్ ఆర్ సి పి లో ఎమ్మెల్సీ ద్వారా మంత్రి పదవి గురించి హామీ లభించడం వల్లే భారీ గా పార్టీ ఫండ్ ఇచ్చి ఆ పార్టీ లో జాయిన్ అయ్యారు అని ఒక రూమర్ కూడా వచ్చింది. ఈ రూమర్ నిజమో కాదో తెలియదు కానీ, అనేక సంవత్సరాలుగా నటిస్తూ, చాలా తెలివి గా భూమి పై పెట్టుబడులు పెట్టిన ఆలీ కొన్ని వందల కోట్ల కు అధిపతి అని, మరొక మాట లో చెప్పాలంటే చాలా మంది స్టార్ హీరోల కంటే, పెద్ద నిర్మాతల కంటే , స్టార్ దర్శకుల కంటే కూడా ఆలీ చాలా ఎక్కువ ఆస్తులు కలిగి ఉన్నాడు అని మాత్రం చాలా మంది చెబుతుంటారు. బహుశా ఈ నేపథ్యం వల్లే, ఆలీ జగన్ కి చాలా పెద్ద మొత్తంలో భారీ పార్టీ ఫండ్ ఇచ్చి ఎమ్మెల్సీ పదవి గురించి, వీలైతే మంత్రి పదవి గురించి హామీ తీసుకొని పార్టీ లో చేరాడు అన్న రూమర్లు బయలుదేరి ఉండవచ్చు.
దీనికి తోడు ఇప్పుడిప్పుడే జగన్ తనను నమ్ముకున్న వారికి ఏదో ఒక రకమైన పదవులు ఇవ్వడం మొదలుపెట్టాడు. కమెడియన్ పృథ్వి కి, గతంలో దర్శకుడు కె.రాఘవేంద్రరావు నిర్వహించిన ఎస్విబిసి ఛానల్ చైర్మన్ పదవి ఇవ్వబోతున్నాడు అని వార్తలు వస్తున్నాయి. ఏది ఏమైనా, ఆలీకి త్వరలో ఎమ్మెల్సీ పదవి రానుందని, రెండేళ్ల లో మంత్రి పదవి కూడా రాబోతుందని వినిపిస్తున్న రూమర్లు నిజమా కాదా తెలియాలంటే మరికొంత కాలం వేచి చూడక తప్పదు.