ప్రముఖ హాస్య నటుడు అలీ ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. ఆయన తల్లి .జైతున్బేబీ గురువారం తెల్లవారుఝామున తుది శ్వాస విడిచారు. ఆమె గత కొద్ది కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. రాజమండ్రి నుంచి మృతదేహాన్ని హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అయితే అలీ ప్రస్తుతం నగరంలో లేరు. ఓ హిందీ సినిమా షూటింగ్ కోసం రాంచీలో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన కూడా బయల దేరారు. జైతున్ అంత్యక్రియలు ఈరోజు మణికొండలో జరుగుతాయని తెలుస్తోంది. అమ్మంటే అలీకి చాలా ఇష్టం. తన కుటుంబాన్ని అలీ చూసుకునే విధానం గురించి పరిశ్రమలో కథలు కథలుగా చెబుతుంటారు. అమ్మని చాలాసార్లు మక్కా కూడా తీసుకెళ్లారు అలీ. ఆమె మరణం అలీకి తీరని లోటే.