రాహుల్ రామకృష్ణ… టాలీవుడ్లో ప్రస్తుతం అత్యంత బిజీగా ఉండే హాస్య నటుల్లో తానొకడు. తన పారితోషికం రోజుకి లక్షకు పైనే. అయినా సరే కాల్షీట్లు అందుబాటులో లేవు. అలాంటి రామకృష్ణ… ఓ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. 2022 తరవాత సినిమాల నుంచి వైదొలుగుతానని ప్రకటించాడు. దాంతో.. రాహుల్ రామకృష్ణకు ఏమైంది? అంటూ అంతా ఆశ్చర్యపోతున్నారు. శుక్రవారం రాత్రి రాహుల్ ఓ ట్వీట్ చేశాడు. “2022 నా ఆఖరి సంవత్సరం. ఇకమీదట సినిమాలు చేయను. ఎవరేమన్నా పట్టించుకోను. నా నిర్ణయానికి కట్టుబడి ఉంటా“ అని ప్రకటించాడు. కారణాలేం చెప్పలేదు.
నిజంగానే రాహుల్ ఈ ట్వీట్ చేశాడా? లేదంటే ఫ్రాంక్ చేస్తున్నాడా? లేదంటే ఇది కూడా ప్రమోషన్లలో భాగమా అనేది తెలియడం లేదు. `జాతి రత్నాలు`లో రాహుల్ చెప్పే ఓ ఫేమస్ డైలాగ్ గుర్తొస్తోంది. `నా వల్లే ప్రాబ్లమ్ అయితే నేను ఎళ్లిపోతా మామా` అనే డైలాగ్ బాగా నవ్వించింది. ఇప్పుడు కూడా అలానే ఆట పట్టిస్తున్నాడా? అనేది మరో ప్రశ్న. మరి.. దీని వెనుక ఏముందో? రాహుల్ హర్టయ్యాడో, లేదంటే.. నవ్వించాలన్న ప్రయత్నాలు మరో రకంగా చేస్తున్నాడో? ఆయనకే తెలియాలి