ప్రముఖ కమెడియన్ సప్తగిరి తెలుగుదేశం పార్టీలో చేరే డేట్ ఫిక్స్ అయ్యింది. ఈనెల 15న కుప్పంలో పార్టీ అధినేత చంద్రబాబు సమక్షంలో పార్టీ కండువా కప్పుకోనున్నారు సప్తగిరి. ఇటివలే రాజకీయ రంగ ప్రవేశంపై మాట్లాడారు సప్తగిరి.
” టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను మనం ఎన్నో చూశాం. నిజాయతీ, నిబద్ధతతో ఇండస్ట్రీలో ఎలా అయితే మంచి పేరు సంపాదించుకున్నానో అలాగే, పాలిటిక్స్‌లోనూ పనిచేస్తానని జిల్లా ప్రజలకు మాటిస్తున్నా’’ అని చెప్పారు సప్తరిగి.
దర్శకుడు కావాలని పరిశ్రమలోకి వచ్చిన సప్తగిరికి ‘పరుగు’ సినిమా నటుడిగా బ్రేక్ ఇచ్చింది. తర్వాత ప్రేమ కథా చిత్రంతో అందరికీ గుర్తుండిపోయే పాత్ర చేశారు. తర్వాత అనేక చిత్రాలలో తనదైన శైలిలో నవ్వులు పంచారు. హీరోగా కూడా కొన్ని సినిమాలు చేసి ప్రేక్షకులని అలరిస్తున్న సప్తగిరి ఇప్పుడు టీడీపీతో రాజకీయ ప్రయాణం మొదలుపెడుతున్నారు.