సునీల్ తర్వాత మళ్ళీ ఆలాంటి కమెడియన్ దొరుకుతాడా? అనే ప్రశ్నకు సమాధానంగా కనిపించాడు సత్య. సునీల్ ని ఇమిటేట్ చేస్తున్నాడనే విమర్శలని బిగినింగ్ లో ఎదురుకున్నాడు. ఆ విమర్శలలో కొంతం వాస్తవం కూడా వుంది. రౌడీ ఫెలోలో సత్యకి చాలా పెద్ద ట్రాక్ వుంది. అందులో చాలా వరకూ సునీల్ బాడీ లాంగ్వేజ్, డిక్షన్ ని అనుకరిస్తున్నట్లు కనిపించాడు. అయితే తర్వాత ఒకొక్క సినిమాకి తనని తాను మార్చుకుంటూ వచ్చాడు.
‘మత్తువదరలా’ సినిమాకి వచ్చేసరి కి తనకంటూ ఒక సెపరేట్ బాడీలాంగ్వేజ్ పట్టేశాడు. కేవలం కామెడీ చేయడానికే కాదు, సినిమా మొత్తాన్ని నిలబెట్టే క్యారెక్టర్ చేయగలడని నిరూపించుకున్నాడు. ఈ సినిమా తర్వాత సత్య కెరీర్ మరో గేర్ లో వెళ్ళింది. సత్య కంటూ సెపరేట్ ట్రాక్స్ రాస్తున్నారు రైటర్స్. రంగబలి సరిగ్గా ఆడలేదు కానీ అందులో సత్య కామెడీ ని మర్చిపోలేం. మొన్న వచ్చిన మిస్టర్ బచ్చన్ ఫస్ట్ హాఫ్ లో సత్యదే అప్పర్ హ్యాండ్.
ఇప్పుడు తనకి టేలర్ మేడ్ సినిమా గా నిలిచిన మత్తువదలరా సినిమాకి పార్ట్ 2 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా చూసిన ప్రతి ఆడియన్ సత్య గురించే మాట్లాడుతున్నారు. సత్య వన్ మ్యాన్ షో అంటున్నారు. కామెడీ కింగ్ సత్య అని కితాబిస్తున్నారు.
నిజానికి ఈ సెకండ్ పార్ట్ ని దర్శకుడు చాలా రేసీ స్క్రీన్ ప్లే తో ఒక థ్రిల్లర్ లా తీశాడు. ఇంతరేసీ స్క్రీన్ ప్లేలో కూడా సత్య అదరగొట్టాడు. ఇప్పటికే సత్య చాలా బిజీ ఆర్టిస్ట్. ఇప్పుడీ సినిమాలో సత్యని చూసిన తర్వాత ఆయన కోసం ఇంకెన్నో పాత్రలు పుట్టుకోస్తాయని చెప్పడంలో సందేహం లేదు.